HomeUncategorizedplane crash | అంతర్జాతీయ ఇష్యూగా మారిన ఫ్లైట్​ క్రాష్..​ గుజరాత్​కు యూకే దర్యాప్తు బృందం

plane crash | అంతర్జాతీయ ఇష్యూగా మారిన ఫ్లైట్​ క్రాష్..​ గుజరాత్​కు యూకే దర్యాప్తు బృందం

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: plane crash : గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్(Ahmedabad)​లో జరిగిన ఫ్లైట్ క్రాష్​లో 241 మంది చనిపోయారు. ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డారు. మరణించిన వారిలో 169 మంది భారతీయులు(Indians), 52 మంది బ్రిటిషర్స్ Britons, ఏడుగురు పోర్చుగీస్​ Portuguese, ఒక కెనెడియన్​ Canadian ఉన్నారు.

ఫ్లైట్​ క్రాష్​లో చనిపోయిన వారిలో బ్రిటిషర్స్ కూడా ఉండటంతో ఈ ఘటన అంతర్జాతీయ సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో యూకే ప్రభుత్వం స్పందించింది.

విమాన ప్రమాదంపై సమగ్ర విచారణ జరపడానికి UK తమ దర్యాప్తు బృందాన్ని అహ్మదాబాద్‌కు పంపించే ఏర్పాట్లు చేస్తోంది. వీరు ఇండియాకు చేరుకున్నాక, విమాన ప్రమాదంపై సమగ్రంగా విచారణ చేపట్టనున్నారు. ఈ విషాద సంఘటనలో 52 మంది బ్రిటిష్ జాతీయులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు విషయం అంతర్జాతీయంగా మారింది.

Must Read
Related News