ePaper
More
    Homeఅంతర్జాతీయంUK - India | యూకేతో చారిత్రాత్మక ఒప్పందం

    UK – India | యూకేతో చారిత్రాత్మక ఒప్పందం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : UK – India | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (donal trump) ప్రపంచ దేశాలపై సుంకాలతో విరుచుకుపడుతున్న వేళ.. భారత్ (india), యూనైటెడ్ కింగ్డమ్ (యూకే) కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

    ద్వైపాక్షిక సంబంధాలకు గణనీయమైన ప్రోత్సాహాన్ని ఇస్తూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA), డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ను (Double Contribution Convention) విజయవంతంగా చేసుకున్నాయి. ట్రంప్ టారిఫ్ వార్ (tariff war) తెరలేపిన తర్వాత భారత్ కుదుర్చుకున్న మొదటి ఒప్పందం ఇదే. దీనిపై ప్రధానమంత్రి మోదీ (Prime Minister Modi) హర్షం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య ఇదో చారిత్రక ఒప్పందమని వ్యాఖ్యానించారు.

    ఇది వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని పేర్కొన్నారు. బ్రిటిష్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్తో (British Prime Minister Keir Starmer) జరిగిన చర్చల తర్వాత మోదీ ఈ ప్రకటన చేశారు. “నా స్నేహితుడు పీఎం కీర్ స్టార్మర్తో (PM Keir Starmer) మాట్లాడటం ఆనందంగా ఉంది. ఒక చారిత్రాత్మక మైలురాయిలో, ఇండియా, యూకే డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్తో పాటు ప్రతిష్టాత్మకమైన, పరస్పరం ప్రయోజనకరమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని విజయవంతంగా చేసుకున్నాయి” అని ఆయన Xలో పోస్ట్ చేశారు.

    ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (free trade agreement) ఎంతో ప్రతిష్టాత్మకమైనది, పరస్పరం ప్రయోజనకరమైనదని మోదీ తెలిపారు. తాజా ఒప్పందం రెండు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుతుందని, బహుళ రంగాలలో వృద్ధిని (growth) పెంచుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మైలురాయి మన రెండు ఆర్థిక వ్యవస్థలలో వాణిజ్యం, పెట్టుబడి, వృద్ధి, ఉద్యోగ సృష్టి (job creation), ఆవిష్కరణలను మరింత ఉత్ప్రేరకపరుస్తుందని తెలిపారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్టర్ను (British Prime Minister Keir Smarter) భారత్కు రావాలని మోదీ స్వాగతం పలికారు. “త్వరలో పీఎం స్టార్మర్ను భారతదేశానికి స్వాగతించడానికి నేను ఎదురుచూస్తున్నాను” అని పేర్కొన్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...