HomeUncategorizedBike Taxi | ఇప్పుడు మహారాష్ట్రలోనూ ఉబెర్‌, ర్యాపిడోపై నిషేధం..ఇలా ఎందుకు ?

Bike Taxi | ఇప్పుడు మహారాష్ట్రలోనూ ఉబెర్‌, ర్యాపిడోపై నిషేధం..ఇలా ఎందుకు ?

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Bike Taxi | మెట్రోపాలిట‌న్ సిటీస్‌లో బైక్స్ టాక్సీల‌పై చాలా మంది ఆధార‌ప‌డుతుంటారు. నిత్యం ట్రాఫిక్‌లో బైక్‌లు న‌డ‌ప‌లేని వారు వీటిని అప్రోచ్ అవుతుంటారు. అయితే ఇప్పుడు ఈ సేవ‌ల‌పై క‌త్తి వేలాడుతోంది. పర్మిట్ లేకుండా బైక్ టాక్సీలు నడుపుతున్నందుకు ఉబెర్‌(Uber), ర్యాపిడో(Rapido) వంటి పెద్ద కంపెనీలపై మహారాష్ట్ర పోలీసులు(Maharashtra Police) కేసు నమోదు చేశారు. కర్ణాటక తర్వాత, మహారాష్ట్రలో కూడా బైక్ టాక్సీ సేవలను నిషేధించే సూచనలు కనిపిస్తున్నాయి. తెల్ల నంబర్ ప్లేట్‌లు (వ్యక్తిగత ఉపయోగం కోసం వాడే వాహనాలు) ఉన్న బైక్‌లను ప్రయాణీకుల రైడ్‌లకు, అంటే వాణిజ్యపరంగా ఉపయోగిస్తున్నట్లు నిర్ధారించారు.

Bike Taxi | ఎందుకిలా..

తెల్ల నంబర్ ప్లేట్‌ (White number plate) ఉన్న వాహనాలను వాణిజ్యపరంగా ఉపయోగించడం చట్టవిరుద్ధం. ఇది మోటారు వాహనాల చట్టం నిబంధనలను ఉల్లంఘించడమేనని అధికారులు తేల్చారు. పెద్ద మహానగరాలలో బైక్ టాక్సీలకు డిమాండ్ చాలా వేగంగా పెరుగుతూ పోతుంది. దీనికి కారణాలు – ట్రాఫిక్ తప్పించుకోవడం, తక్కువ ఛార్జీలు, మెట్రో స్టేషన్ లేదా ఆఫీసుకు త్వరగా చేరుకునే సౌలభ్యం, యువతలో ప్రజాదరణ. ముఖ్యంగా.. ముంబై వంటి నగరాల్లో ప్రతిరోజూ వేలాది మంది బైక్ టాక్సీ(Bike taxi)లో ప్రయాణిస్తారు, ఇది చౌకైన, మెరుగైన రవాణా మార్గం. అయితే భారతదేశంలో బైక్ టాక్సీలకు ఇంకా స్పష్టమైన చట్టపరమైన వర్గీకరణ లేదు.

ప్రస్తుతం ఉన్న రూల్స్‌ ప్రకారం, తెల్లటి నంబర్ ప్లేట్ ఉన్న బైక్‌ను ఏదైనా వాణిజ్య చర్య కోసం ఉపయోగించడం చట్టవిరుద్ధం. ఉబెర్ & ర్యాపిడో వంటి కంపెనీలు తమను తాము కేవలం “టెక్నాలజీ ప్లాట్‌ఫామ్”(Technology platform)గా అభివర్ణించుకుంటున్నప్పటికీ, చట్టపరంగా ఈ వాదన కోర్టులో చెల్లదు. ర్యాపిడో వంటి కంపెనీలు రైడ్‌ను “పార్శిల్”గా ప్రకటించి, తాము పార్శిల్ డెలివరీలు మాత్రమే చేస్తున్నామని చెప్పుకుంటున్నాయి. కానీ ప్రభుత్వం , కోర్టులు ఈ రకమైన మోసాన్ని కనిపెట్టాయి. ఆటో, టాక్సీ యూనియన్ల ఒత్తిడి కారణంగా కర్ణాటక ప్రభుత్వం బైక్‌ టాక్సీలపై కఠిన చర్యలు తీసుకుంది . ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం(Maharashtra Government) కూడా అదే దిశలో చర్యలు తీసుకుంటోంది. రెండు రాష్ట్రాలు తీసుకున్న ఈ నిర్ణ‌యం వేరే రాష్ట్రాల‌పై కూడా ప‌డుతుందా లేదా అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Must Read
Related News