HomeUncategorizedUber cab driver | ఆఫీస్​కు వెళ్లేందుకు క్యాబ్​ బుక్​ చేసింది.. డ్రైవర్​గా వచ్చిన వ్యక్తిని...

Uber cab driver | ఆఫీస్​కు వెళ్లేందుకు క్యాబ్​ బుక్​ చేసింది.. డ్రైవర్​గా వచ్చిన వ్యక్తిని చూసి షాక్​..

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uber cab driver | బెంగళూరు(Bengaluru)లో ఓ మహిళకు ఆసక్తికరమైన అనుభవం ఎదురైంది. ఆఫీసుకు వెళ్లేందుకు ఆమె ఉబెర్ క్యాబ్(Uber cab) బుక్ చేసుకుంది. కాగా.. క్యాబ్ డ్రైవర్‌గా వచ్చిన వ్యక్తిని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఎందుకంటే అతడు తన ఆఫీసులోని టీమ్ లీడర్. ఈ విషయాన్ని, తన అనుభవాన్ని ఆమె సోషల్ మీడియా(social media)లో పోస్టు చేయగా.. అది వైరల్‌(viral) అవుతోంది.

సదరు యువతి తన అనుభవాన్ని స్క్రీన్ షాట్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, “నేను ఉబెర్ బుక్ చేశాను. నన్ను పిక్ చేసేందుకు వచ్చిన మనిషి మా ఆఫీసులో టీమ్ లీడర్​” అని పేర్కొంది. ఆమె అతడిని “సార్, మీరు క్యాబ్ డ్రైవ్ చేస్తున్నారా?” అని అడిగింది. ఇందుకు అతడు సమాధానం ఇస్తూ.. “సరదా కోసం, బోర్ కొట్టకుండా” అని బదులిచ్చాడట.

ఈ ఘటనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది “ఇదేం సరదా బాబు” అని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు “ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరంలో సరదా కోసం క్యాబ్ డ్రైవింగ్ చేయడం వింత అనుభవంగా ఉంటుంది” అని వ్యాఖ్యానించారు.

మరికొందరు పాజిటివ్​గా స్పందించారు. అమెరికా(America) లాంటి దేశాల్లో పెద్ద సంస్థల సీఈవోలు కూడా పార్ట్ టైం జాబ్స్ చేస్తారు. కానీ, మన దగ్గర ఇలా చేస్తే.. ఇదో పెద్ద విషయం, తప్పు చేస్తున్న ఫీలింగ్​ ఎందుకు..? కష్టపడుతున్నాడు కదా.. వీలైతే ఎంకరేజ్​ చేయండి. చేతకకపోతే నోరుమూసుకోండి.. కానీ, పనిచేసుకునేవారిని కించపర్చకండి.. అంటూ గట్టగానే బదులిస్తున్నారు. అతడికి సపోర్టుగా నిలుస్తున్నారు.

ఇలాంటి ఘటన గతంలోనూ చోటుచేసుకుంది. జులై 2024లో ఓ మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్(Microsoft software engineer) వారాంతంలో తన కంపెనీ హుడీ ధరించి మరీ ఆటో డ్రైవింగ్ చేస్తూ కనిపించాడు. ఒంటరితనాన్ని అధిగమించేందుకు ఇలా డ్రైవింగ్ చేస్తున్నట్లు ధైర్యంగా చెప్పుకొచ్చాడు. ఈ ఘటనలు ఉద్యోగుల(employees) వ్యక్తిగత అభిరుచులు, జీవనశైలిపై కొత్త కోణాలను వెలుగులోకి తెస్తున్నాయి.

Must Read
Related News