అక్షరటుడే, వెబ్‌డెస్క్: T20i Match | క్రికెట్ మ్యాచుల్లో ఈ మధ్య పసికూనలు చరిత్రలు సృష్టిస్తున్నాయి. చిన్న జట్లే అని తక్కువ అంచనా వేసిన టీమ్‌లకి గట్టి షాకులే ఇస్తున్నాయి.
తాజాగా పసికూన యూఏఈ (UAE) చరిత్ర సృష్టించింది. టీ20 క్రికెట్‌లో (T20 cricket) బంగ్లాదేశ్ పై తొలి విజయాన్ని సాధించి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో (T20 series) భాగంగా సిరీస్ 1-1 సమం చేసింది. సోమవారం షార్జా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో 20 మ్యాచ్‌లో యూఏఈ రెండు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. తాజా విజయంతో 5 భారీ విజయాలను సాధించిన జట్టుగా మారింది. తొలి టీ20లో బంగ్లాదేశ్ (bangladesh) 27 పరుగుల తేడాతో యూఏఈని (UAE) ఓడించింది. రెండో టీ20లోనూ ఇదే అవకాశం లభించింది. కానీ, ఈసారి యూఏఈ ఆటగాళ్ళు పట్టికలను తిప్పికొట్టి, ఒక బంతి మిగిలి ఉండగానే మ్యాచ్‌ను గెలిచారు.
T20i Match | పోరాట పటిమ..
యూఏఈ సాధించిన ఈ సూపర్ విజయానికి హీరోగా దాని కెప్టెన్ మహ్మద్ వసీం (captain mohammad wasim) నిలిచాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ (bangladesh) నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తంజిద్ హసన్ (33 బంతుల్లో 59 పరుగులు) అర్ధ సెంచరీ (half century) చేయగా తౌహిద్ హృదోయ్ (24 బంతుల్లో 45 పరుగులు), లిటన్ దాస్ (32 బంతుల్లో 40 పరుగులు) లు రాణించారు. యూఏఈ బౌలర్లలో జవదుల్లా మూడు వికెట్లు తీశాడు. సగీర్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు. అనంతరం కెప్టెన్ ముహమ్మద్ వసీం (42 బంతుల్లో 82 పరుగులు) అద్భుత ఇన్నింగ్స్ ఆడగా.. మిగిలిన బ్యాటర్లు తలా ఓ చేయి వేయడంతో లక్ష్యాన్ని యూఏఈ 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి అందుకుంది.
బంగ్లా బౌలర్లలో (bangladesh bowlers) షొరీఫుల్, నహిద్ రాణా, రిషద్ హొసేన్ తలా ఓ రెండు వికెట్లు తీయగా తన్వీర్ ఇస్లాం, తంజిమ్ హసన్ చెరో వికెట్ సాధించారు. ఒక జట్టు విజయం, వైఫల్యం ఆ జట్టు కెప్టెన్ నాయకత్వంపై ఆధారపడి ఉంటుందని మనం నమ్ముతాం. బంగ్లాదేశ్ (bangladesh) యూఏఈ మధ్య జరిగిన రెండవ టీ20 (second T20) దీనికి ఉదాహరణగా నిలిచింది.
ఈ మ్యాచ్‌లో యూఏఈ కెప్టెన్ మహ్మద్ వసీం (UAE captain mohammad wasim) తన జట్టును బ్యాటింగ్‌లో ముందుండి నడిపించాడు. బంగ్లాదేశ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, అతను తన జట్టు ఇన్నింగ్స్‌ను ప్రారంభించడమే కాకుండా, దానిని ధైర్యంగా ముగించాడు. అవుట్ అయ్యే ముందు మ్యాచ్‌ను పటిష్ట స్థితికి తీసుకెళ్లాడు. దీంతో యూఏఈ సులువుగా విజయం సాధించింది. ఇక ఇరు జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ (third Tమే 21న జరగనుంది. ఈ మ్యాచ్‌తో సిరీస్ విన్నర్ ఎవరో తేలిపోనుంది.