ePaper
More
    Homeఅంతర్జాతీయంUAE Indian Doctor | యూఏఈ ఇండియన్​ డాక్టర్​ దాతృత్వం.. మరణించిన వైద్య విద్యార్థులకు రూ.6...

    UAE Indian Doctor | యూఏఈ ఇండియన్​ డాక్టర్​ దాతృత్వం.. మరణించిన వైద్య విద్యార్థులకు రూ.6 కోట్ల విరాళం

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UAE Indian doctor : అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదంలో ఐదుగురు MBBS విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే. సదరు బాధిత కుటుంబాలకు UAEకి చెందిన భారతీయ వైద్యుడు షంషీర్ వాయలిల్ (Indian doctor Shamshir Vayalil) రూ.6 కోట్ల విరాళం ప్రకటించారు. స్వయంగా మెడికల్ హాస్టళ్లలో నివసించిన ఆయన విద్యార్థుల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు.

    అహ్మదాబాద్‌(Ahmedabad)లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం(Air India crash)లో వైద్య విద్యార్థులు మరణించడంపై తీవ్ర భావోద్వేగానికి గురైన వాయలిల్, BJ మెడికల్ కాలేజీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (BJ Medical College Junior Doctors Association) ద్వారా సహాయాన్ని పంపిణీ చేయనున్నారు.

    అబుదాబి నుంచి సాయాన్ని ప్రకటిస్తూ, పశ్చిమాసియాలో ప్రముఖ ఆరోగ్య సంరక్షణ ప్రదాత అయిన బుర్జీల్ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్, VPS హెల్త్ మేనేజింగ్ డైరెక్టర్ వాయలిల్.. ప్రమాదం తర్వాత జరిగిన పరిణామాలను చూసినప్పుడు తాను తీవ్రంగా కలత చెందానని తెలిపారు. వాయలిల్ తాను చదువుకునే రోజుల్లో మంగళూరు(Mangalore)లోని కస్తూర్బా మెడికల్ కాలేజీ (Kasturba Medical College), తర్వాత చెన్నై(Chennai)లోని శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజీ (Sri Ramachandra Medical College) హాస్టళ్లలో ఉన్నారు. ఆ అనుభూతితో వైద్య విద్యార్థుల పట్ల సానుభూతి చూపారు.

    UAE Indian Doctor | విరాళంగా రూ.6 కోట్లు

    వాయలిల్ తన సహాయ ప్యాకేజీలో మరణించిన నలుగురు విద్యార్థుల కుటుంబాలలో ఒక్కొక్కరికి రూ. కోటి, తీవ్రంగా గాయపడిన ఐదుగురు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 20 లక్షలు, తమ వారిని కోల్పోయిన వైద్యుల కుటుంబాలకు రూ. 20 లక్షలు ప్రకటించారు. ఈ సహాయం అత్యంత అవసరంలో ఉన్నవారికి చేరేలా BJ మెడికల్ కాలేజీలోని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ భాగస్వామ్యంతో పంపిణీ చేయనున్నారు.

    UAE Indian Doctor | గతంలోనూ చేయూత

    వయాలిల్ ఇలాంటి ఘటనలకు స్పందించడం ఇదే మొదటిసారేం కాదు. 2010లో, మంగళూరు విమాన ప్రమాదం తర్వాత, పశ్చిమాసియాలోని ప్రముఖ ఆరోగ్య సంరక్షణ ప్రదాత అయిన బుర్జీల్ హోల్డింగ్స్‌లో బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం, ఉపాధి అవకాశాలను కల్పించారు. జూన్​ 12న అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా విమానం AI171 బీజే మెడికల్ కాలేజీలోని అతుల్యం హాస్టల్ కాంప్లెక్స్‌లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్నవారితో పాటు పలువురు వైద్య విద్యార్థులు సైతం దుర్మరణం చెందారు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...