అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Dating App | ఇద్దరు యువకులు డేటింగ్ యాప్‌లో (Dating App) పరిచయమై ఓయో రూమ్‌లో కలుసుకున్నారు. ఈ క్రమంలో అందులో ఓ యువకుడు మరో వ్యక్తిపై అఘాయిత్యానికి పాల్పడబోయాడు.
హైదరాబాద్ నగరానికి (Hyderabad City) చెందిన డాక్టర్‌కు డేటింగ్ యాప్‌లో ఓ యువకుడితో పరిచయం అయింది. ఇద్దరు నిత్యం చాటింగ్ చేసుకునేవారు. ఈ క్రమంలో ఇద్దరు కలుసుకోవాలని నిర్ణయించున్నార. అనంతరం ఓయో రూమ్ (Oyo room) బుక్ చేసుకున్నారు. అయితే అక్కడకు వెళ్లాక సదరు వైద్యుడిపై మరో యువకుడు అఘాయిత్యం చేయబోయాడు.
Dating App | డబ్బుల కోసం..
సదరు డాక్టర్ నిరాకరించడంతో యువకుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. తాము రహస్యంగా కలిసిన విషయాన్ని బయట పెడతానని బ్లాక్ మెయిల్ (blackmail) చేశాడు. దీంతో భయపడిన సదరు డాక్టర్ రూ.5 వేలు ఇచ్చి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అయితే నిందితుడు అంతటితో ఆగకుండా అతను పని చేసే ఆస్పత్రికి వెళ్లి గొడవ చేశాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.