ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Andhra Pradesh | అనంతపురంలో విషాదం.. గొంతులో దోశ ముక్క ఇరుక్కొని రెండేళ్ల బాలుడు మృతి

    Andhra Pradesh | అనంతపురంలో విషాదం.. గొంతులో దోశ ముక్క ఇరుక్కొని రెండేళ్ల బాలుడు మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా (Anantapur District) తపోవనంలో ఓ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. రెండేళ్ల చిన్నారి(Two Years Old Boy) కుశల్‌ గొంతులో దోశ ముక్క ఇరుక్కోవడంతో ఊపిరాడక మృత్యువాత పడ్డాడు. తల్లిదండ్రులు కళ్ళముందే బిడ్డ ప్రాణాలు కోల్పోవడంతో వారు క‌న్నీరు మున్నీరుగా విలపించారు. ఆ దృశ్యాలు ప్ర‌తి ఒక్క‌రి హృదయాన్ని కదిలించాయి.

    వివరాల్లోకి వెళ్తే.. తపోవనానికి చెందిన చిన్నారి కుశల్ (2) తన తల్లితో కలిసి భోజనం చేస్తున్న సమయంలో దోశ(Dosa) ముక్కను తొందరపడి నోట్లో వేసుకున్నాడు. అది గొంతులో (Throat) ఇరుక్కొని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే అతని ప్రాణం పోయిన‌ట్టు వైద్యులు ధ్రువీకరించారు.

    Andhra Pradesh | ఊహించ‌ని ప్ర‌మాదం..

    ఈ వార్త విన్న కుటుంబసభ్యులు, స్నేహితులు, పంచాయితీ ప్రజలు విషాదంలో మునిగిపోయారు. కుశల్ తల్లి శోకసంద్రంలో కూరుకుపోయి ఆ చిన్నారి కోసం కన్నీరుమున్నీరుగా విల‌పించింది. తల్లిదండ్రుల రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి.

    ఈ ఘటనపై వైద్యులు, పిల్లల నిపుణులు స్పందిస్తూ చిన్నారులు తిండి తినే సమయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. చిన్న పిల్లలకు మింగలేనివి, గొంతులో ఇరుక్కొయ్యే ఆహార పదార్థాలు తినిపించేటప్పుడు శ్రద్ధ వహించాలన్నారు. చిన్నారులు ఆడుకుంటున్నప్పుడు ఏవైనా వస్తువులు నోట్లో పెట్టుకోవడం వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు సంభవించవచ్చని వైద్యులు తెలిపారు.

    చిన్న వయస్సులో పిల్లల గొంతు మార్గాలు బలహీనంగా ఉంటాయి. తినే పదార్థాలను చిన్న ముక్కలుగా చేసి, నెమ్మదిగా తినిపించాలి. తినే సమయంలో పిల్లలపై (Childrens) దృష్టి పెట్టాలి అని సూచిస్తున్నారు వైద్యులు. చిన్న తప్పిదం వల్లే తల్లిదండ్రులు జీవితాంతం భరించలేని విషాదానికి లోను కావ‌ల్సి వ‌చ్చింది. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు అన్ని కుటుంబాల్లోనూ చిన్నారుల ప‌ట్ల ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించాలి.

    Read all the Latest News on Aksharatoday and also follow us in ‘X‘ and ‘Facebook

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...