ePaper
More
    Homeఅంతర్జాతీయంBoat Capsized | నడి సంద్రంలో మునిగిన రెండు నావలు.. 193 మంది దుర్మరణం!

    Boat Capsized | నడి సంద్రంలో మునిగిన రెండు నావలు.. 193 మంది దుర్మరణం!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Boat Capsized | నడి సంద్రంలో ఘోర ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. రెండు నావలు నట్టేట మునిగి వందల మంది ప్రాణాలను హరించాయి. వందల మంది గల్లంతయ్యారు.

    193 మంది ప్రయాణికులను బలి తీసుకున్న ఈ ఘటనలు డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో (Democratic Republic of the Congo)లోని వాయువ్య ప్రాంతంలో చోటుచేసుకున్నాయి.

    Boat Capsized | ఈక్వెటార్ ప్రావిన్స్‌కు..

    ఈక్వెటార్ (Ecuador)​ ప్రావిన్స్‌కు 150 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. బుధవారం (సెప్టెంబరు 10), గురువారం (సెప్టెంబరు 11) ఈ ప్రమాదాలు జరిగినట్లు అధికారులు తెలిపారు.

    ఈక్వెటార్​ ప్రావిన్స్​లోని లుకోలెలా భూభాగం నుంచి గురువారం సాయంత్రం సుమారు 500 మందితో ఓ భారీ పడవ బయలుదేరింది. మార్గమధ్యలో ఓడలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నీ కీలకాలు వ్యాపించి ఓడ బోల్తా పడింది.

    ఈ దుర్ఘటనలో 107 మంది మరణించినట్లు కాంగో మంత్రిత్వ శాఖ ministry వెల్లడించింది. మరో 209 మందిని రక్షించినట్లు ప్రకటించింది.

    మలాంగే గ్రామానికి చెందిన మరో ఓడ సాయంతో ప్రయాణికులను ఒడ్డుకు చేర్చినట్లు మంత్రిత్వశాఖ వివరించింది. ఈ శాఖ నివేదిక ప్రకారం 146 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది.

    బుధవారం బసాన్‌కుసు ప్రాంతంలో మోటారుతో నడిచే ఓడ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 86 మంది మరణించారు. మృతుల్లో ఎక్కువగా విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది.

    More like this

    Forest Land | మంచిర్యాల జిల్లాలో ఉద్రిక్తత.. అటవీ ప్రాంతంలో గుడిసెలు తొలగిస్తున్న అధికారులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Forest Land | మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం దమ్మన్నపేట(Dammanapeta)లో శనివారం తీవ్ర ఉద్రిక్తత...

    Warangal Congress | వ‌రంగ‌ల్ కాంగ్రెస్‌లో ముదిరిన విభేదాలు.. కొండా సురేఖ‌పై పీసీసీకి ఎమ్మెల్యే ఫిర్యాదు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Warangal Congress | వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో (Congress Party) విభేదాలు మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డాయి....

    Hyderabad railway terminals | హైదరాబాద్​ చుట్టూ మూడు భారీ రైల్వే టెర్మినళ్లు.. ఏ మార్గాల్లోనంటే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad railway terminals | రైళ్ల రద్దీ దృష్ట్యా తెలంగాణ Telangana రాజధాని హైదరాబాద్‌ చుట్టూ...