Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | చోరీ కేసులో ఇద్దరికి ఏడు నెలల జైలు

Kamareddy | చోరీ కేసులో ఇద్దరికి ఏడు నెలల జైలు

- Advertisement -

అక్షర టుడే, కామారెడ్డి: Kamareddy | తాళం వేసిన రెండిళ్లలో చోరీకి పాల్పడిన ఇద్దరికి 7 నెలల జైలుశిక్ష విధిస్తూ కామారెడ్డి అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ (First Class Magistrate) బట్టు దీక్ష తీర్పునిచ్చారు. గత ఫిబ్రవరి 17, 20 తేదీల్లో తాడ్వాయి మండలం (Tadwai mandal) సంగోజివాడికి చెందిన గడ్డం రాజవ్వ, రాజశేఖర్ ఇళ్లలో చోరీ జరిగింది.

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు అదే గ్రామానికి చెందిన దోమకొండ అనిల్, గడ్డం బాలరాజు చోరికి పాల్పడినట్లు విచారణలో గుర్తించారు. ఈ మేరకు గురువారం కోర్టులో హాజరు పరచగా, విచారించిన జడ్జి నిoదితులకు 7 నెలల జైలు శిక్ష, రూ. 200 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.