అక్షరటుడే, బోధన్: Bodhan | ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు బోధన్ తహశీల్దార్ (Bodhan Tahsildar) విఠల్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సుంకిని నుంచి బోధన్ వైపునకు ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్నామన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తీసుకెళ్తున్నట్లు సమాచారం రావడంతో.. వాటిని సీజ్‌చేసి తహశీల్దార్ కార్యాలయానికి తరలించినట్లు వివరించారు.
