HomeUncategorizedKannappa | క‌న్న‌ప్ప మూవీ హార్డ్ డ్రైవ్‌తో యువ‌తి ప‌రారీ.. పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదు

Kannappa | క‌న్న‌ప్ప మూవీ హార్డ్ డ్రైవ్‌తో యువ‌తి ప‌రారీ.. పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Kannappa | మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ‘కన్నప్ప’ Kannappa సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. ఈ మూవీకి సంబంధించి షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.

కన్నప్ప చిత్రంలో విష్ణుతో పాటు, ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్, ఐశ్వర్య రాజేష్, శరత్ కుమార్, బ్రహ్మానందం, తదితరులు నటిస్తున్నారు. ప‌లువురు స్టార్స్‌తో భారీ ప్రాజెక్ట్‌గా ఈ మూవీ రూపొందుతుంది. తెలుగుతో పాటు హిందీ, మలయాళం, కన్నడ, తమిళ్.. సహా పలు ప్రాంతీయ భాషల్లో సినిమా రిలీజ్ కానుంది. ‘కన్నప్ప’ చిత్రంలోని తదుపరి పాట మే 28న కాల శ్రీకాళహస్తిలో విడుదల కానుంది. ఈ పాటను విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా స్వయంగా పాడారు. ఈ చిత్రానికి స్టీఫెన్ దేవాసి సంగీతం సమకూర్చారు.

Kannappa | కావాల‌నే చేశారా..!

ముఖేష్ కుమార్ సింగ్ ‘కన్నప్ప’ చిత్రానికి దర్శకత్వం వహించారు. మోహన్ బాబు మహాదేవ శాస్త్రి అనే పాత్రను పోషిస్తున్నారు. సుమారు రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ తో కన్నప్ప సినిమా తెరకెక్కుతోంది. మ‌రి కొద్ది రోజుల‌లో మూవీ రిలీజ్‌కి ఉంది. ఈ సమయంలో చిత్రానికి సంబంధించి అత్యంత కీలకమైన సమాచారం ఉన్న హార్డ్‌డ్రైవ్‌(Hard Drive)ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోయారని చిత్ర ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఫిలింనగర్‌(Filmnagar)లో కలకలం రేపింది.

పోలీసులు ఇచ్చిన స‌మాచారం మేర‌కు.. కోకాపేటకు చెందిన రెడ్డి విజయ్‌కుమార్ Vijay Kumar ట్వంట్వీఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ప‌ని చేస్తున్నారు. కన్నప్ప సినిమాకు చెందిన ముఖ్యమైన కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్‌ను ముంబైలోని హెచ్ఐవీఈ స్టూడియోస్ ఇటీవల కొరియర్ ద్వారా ఫిలింనగర్‌‌లోని విజయ్ కుమార్ కార్యాలయానికి పంపింది.

ఈ నెల 25వ తేదీన ఆ కొరియర్ పార్శిల్‌ను కార్యాలయంలో పనిచేసే ఆఫీస్‌బాయ్‌ రఘు(Officeboy Raghu) అందుకున్నాడు. అయితే, ఈ విషయాన్ని ఆయన ఎవరికీ చెప్పకుండా దానిని చరిత అనే మహిళకు ఇచ్చినట్టు తెలిసింది. ఆ తర్వాతి నుంచి ఇద్దరూ కనిపించకుండా పోయారు.తమ సినిమా ప్రాజెక్టుకు ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించాలనే దురుద్దేశంతో గుర్తు తెలియని వ్యక్తుల మార్గనిర్దేశంలో రఘు, చరిత (Charita) ఈ కుట్రకు పాల్పడ్డారని విజయ్‌కుమార్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు(Police) దర్యాప్తు ప్రారంభించారు. హార్డ్‌డ్రైవ్ అపహరణ వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించే ప‌నిలో ఉన్నారు.