అక్షరటుడే, కమ్మర్పల్లి: kammarpally | చేపలవేటకు వెళ్లిన ఇద్దరు విద్యుదాఘాతంతో మృతి చెందారు. ఈ విషాదకర ఘటన కమ్మర్‌పల్లిలో బుధవారం చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని గాంధీనగర్‌కు (Gandhi Nagar) చెందిన ఇద్దరు వ్యక్తులు కొండపల్లి లక్ష్మణ్, సిత్తరి నర్సింలు అనే ఇద్దరు వ్యక్తులు కమ్మర్పల్లి జాతీయ రహదారి పక్కన కుంటలో చేపల వేటకు వెళ్లారు.
అయితే అక్కడ వారిద్దరికి విద్యుత్‌షాక్ (Electric shock) కొట్టింది. దీంతో వారిరువురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. సమాచారం అందుకున్న పోలీసులు (kammarpally Police) సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.