HomeజాతీయంLIC Schemes | ఎల్‌ఐసీ నుంచి మరో రెండు కొత్త స్కీమ్స్‌..

LIC Schemes | ఎల్‌ఐసీ నుంచి మరో రెండు కొత్త స్కీమ్స్‌..

ఎల్‌ఐసీ మరో రెండు స్కీమ్స్‌ను తీసుకువచ్చింది. జన్‌ సురక్ష, బీమా లక్ష్మి పేర్లతో తీసుకువచ్చిన ఈ స్కీమ్స్‌ రేపటినుంచి అందుబాటులోకి రానున్నాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: LIC Schemes | ఎల్‌ఐసీ మరో రెండు స్కీమ్స్‌ను ప్రవేశపెట్టింది. ఇవి రేపటినుంచి అందుబాటులోకి రానున్నాయి. ఆయా పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ ప్రకటించాల్సి ఉంది.

అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ అయిన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ మరో రెండు కొత్త స్కీమ్స్‌ను తీసుకువచ్చింది. జన్‌ సురక్ష (Jan Suraksha), బీమా లక్ష్మి పేర్లతో తీసుకువచ్చిన ఈ స్కీమ్స్‌ రేపటినుంచి (అక్టోబర్‌ 15 నుంచి) అందుబాటులోకి రానున్నాయి. ఆ స్కీమ్స్‌ గురించి తెలుసుకుందాం..

LIC Schemes | ఎల్‌ఐసీ జన్‌ సురక్ష..

తక్కువ ఖర్చుతో కూడిన మైక్రో ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ ఇది. ప్రధానంగా తక్కువ ఆదాయ వర్గాల ప్రజల కోసం దీనిని తీసుకువచ్చారు. ఇది నాన్‌ పార్టిసిపేటింగ్ (non-participating), నాన్‌ లింక్డ్‌ స్కీమ్‌. అంటే మార్కెట్‌తో లేదా కంపెనీ లాభాలు లేదా బోనస్‌తో ముడిపడి ఉండదు. మైక్రో ఇన్సూరెన్స్‌ (Micro Insurance) కావడంతో ఇక్కడ తక్కువ ప్రీమియం, అనుకూలమైన చెల్లింపు ఎంపికలతో ఆర్థికంగా బలహీన వర్గాల వారికి రక్షణ కల్పిస్తుంది.

LIC Schemes | ఎల్‌ఐసీ బీమా లక్ష్మి..

ఎల్‌ఐసీ అందుబాటులోకి తీసుకువచ్చిన మరో స్కీమ్‌ బీమా లక్ష్మి (Bima Lakshmi). ఇది కూడా నాన్‌ పార్టిసిపేటింగ్, నాన్‌ లింక్డ్‌ (Non linked) స్కీమే. ఇక్కడ కూడా రాబడికి మార్కెట్‌ పనితీరుతో సంబంధం ఉండదు. ఈ ప్లాన్‌ ద్వారా లబ్ధిదారులకు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీతో పాటు, మెచ్యూరిటీ లేదా పొదుపు చెల్లింపు (సేవింగ్స్‌ పే అవుట్‌) ప్రయోజనం లభించే అవకాశాలున్నాయి. ఈ కొత్త స్కీమ్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ ప్రకటించాల్సి ఉంది.