Homeటెక్నాలజీOnePlus | భారీ బ్యాటరీ, శక్తివంతమైన చిప్‌సెట్‌తో.. వన్‌ప్లస్‌ నుంచి మరో రెండు ఫోన్లు

OnePlus | భారీ బ్యాటరీ, శక్తివంతమైన చిప్‌సెట్‌తో.. వన్‌ప్లస్‌ నుంచి మరో రెండు ఫోన్లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: వన్‌ప్లస్‌(OnePlus) నుంచి త్వరలో మరో రెండు మోడళ్లు విడుదల కానున్నాయి. వచ్చేనెల 8వ తేదీ నుంచి సేల్స్‌ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

చైనాకు చెందిన ఒప్పో(Oppo) అనుబంధ సంస్థ అయిన వన్‌ప్లస్‌ ఇండియా.. దేశీయ వినియోగదారులను ఆకర్షించడానికి కొత్త మోడళ్ల(New models)ను రిలీజ్‌ చేస్తోంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ 5, నార్డ్‌ సీఈ 5 పేర్లతో వస్తున్న మోడళ్ల వివరాలు, విడుదల తేదీలను కంపెనీ ప్రకటించింది. వచ్చేనెల 8 వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు సేల్స్‌ ప్రారంభం కానున్నాయి. అమెజాన్‌(Amazon), వన్‌ప్లస్‌ స్టోర్‌లలో అందుబాటులో ఉండనున్న ఈ మోడళ్ల స్పెసిఫికేషన్స్‌ తెలుసుకుందామా..

OnePlus : వన్‌ప్లస్‌ నార్డ్‌ 5(OnePlus Nord 5)..

  • 6.77 అంగుళాల ఫ్లాట్‌ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1.5K రిజల్యూషన్‌, 120Hz రీఫ్రెష్‌ రేట్‌ అందిస్తుంది.
  • క్వాల్కం స్నాప్‌డ్రాగన్‌ 8s జెన్‌ 3 మొబైల్‌ ప్లాట్‌ఫాం చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. ఇది మెరుగైన గేమింగ్‌ అనుభూతిని అందిస్తుంది. BGMI 90fps ను సపోర్టు చేస్తుంది.
  • 6650 mAh – 7000 mAh భారీ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్‌ 100w ఫాస్ట్‌ చార్జింగ్‌ను సపోర్టు చేయనుంది.
  • ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత ఆక్సిజన్‌ ఓఎస్‌ 15 ఆపరేటింగ్‌ సిస్టమ్‌.
  • వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS) 50 MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు 8 MP అల్ట్రావైడ్‌ కెమెరా ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్‌ కోసం 16 MP ఫ్రంట్ కెమెరా ఉంది.
  • 12GB + 250 GB Variant ధర రూ. 30 వేలు, 16 GB + 512 GB Variant ధర రూ. 36 వేలలోపు ఉండే అవకాశం ఉంది.

OnePlus : వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 5(OnePlus Nord CE 5)..

  • ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. రీఫ్రెష్‌ రేట 120 Hz.
  • మీడియాటెక్‌ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్‌(4ఎన్‌ఎం, టీఎస్‌ఎంసీ ఫ్యాబ్రికేషన్‌). ఇది కూడా మెరుగైన గేమింగ్‌ అనుభూతిని ఇస్తుంది.
  • 7100 mAh బ్యాటరీతో వస్తున్న ఈ మోడల్‌ ఫోన్‌ 80w ఫాస్ట్‌ చార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది.
  • 50 MP ప్రైమరీ కెమెరా, 8 MP అల్ట్రావైడ్‌ లెన్స్‌తోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16 MP కెమెరా ఉండనున్నాయి.
  • 8 GB + 256 GB Variant ధర రూ. 30వేలలోపు ఉండే అవకాశాలున్నాయి.