అక్షరటుడే, వెబ్డెస్క్ : Thunderstorm | రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు వర్షం heavy rain కురిసింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ hyderabad లో వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి.
మహబూబాబాద్ mahabubabad జిల్లాలో పిడుగు పడి ఇద్దరు మృతి చెందారు. గూడూరు gudur మండలం గుండెంగలో పంచాయతీ ఉద్యోగి ప్రభు పిడుగు పడి చనిపోయాడు. ఓటాయి గ్రామంలో గొర్రెల కాపరి చేరాలు కూడా పిడుగు పాటుతో మృతి చెందాడు. మరోవైపు వర్షాలతో ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
Thunderstorm | సీఎం సమీక్ష
తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి cm revanth redddy సమీక్షించారు. వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్‌లలో ధాన్యం తడవకుండా చూడాలని కలెక్టర్లకు సూచించారు. హైదరాబాద్‌లో రోడ్లపై నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలన్నారు.