అక్షర టుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | మద్యం తాగి వాహనాలు నడిపిన కేసులో ఇద్దరికి జైలు శిక్ష విధించినట్లు మోపాల్ ఎస్సై సుస్మిత (Mopal SI Susmita) తెలిపారు. మండలంలోని కులాస్‌పూర్‌కు చెందిన గణేష్, సిరిపూర్‌కు చెందిన మహిపాల్ ఇటీవల డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడినట్లు పేర్కొన్నారు.
ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి, గురువారం జిల్లా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చినట్లు చెప్పారు. దీంతో విచారించిన న్యాయస్థానం నిందితులిద్దరికి నాలుగు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై వెల్లడించారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దని, లేనిపక్షంలో చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.