అక్షర టుడే, పెద్ద కొడపగల్ : Pedda Kodapgal | మండలంలోని పోచారం తండా, పోచారం గ్రామానికి (Pocharam village) చెందిన ఇద్దరు వ్యక్తులు నక్కల దాడిలో గాయపడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. పోచారం తండాకు చెందిన నారాయణ్, పోచారం గ్రామానికి చెందిన జ్ఞానేశ్వర్‌పై సోమవారం గ్రామ శివారులో నక్కలు దాడి (Fox Attack) చేసినట్లు వారు తెలిపారు. గాయపడిన వారిని మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం బాన్సువాడకు తరలించారు.