అక్షరటుడే, వెబ్డెస్క్ : America | రెండు హెలిక్యాప్టర్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన అమెరికాలోని న్యూజెర్సీ హామోంటన్ (New Jersey Hammonton)లో చోటు చేసుకుంది.
హామోంటన్లోని 100 బేసిన్ రోడ్ వద్ద రెండు హెలికాప్టర్లు కూలిపోయాయి. ఒక విమానం పూర్తిగా మంటల్లో మునిగిపోయిందని, రెండో హెలికాప్టర్ (Helicopter) సమీపంలోని అటవీ ప్రాంతంలో కూలిపోయిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.హామోంటన్ మున్సిపల్ విమానాశ్రయం (Municipal Airport) సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
హామోంటన్ ఆదివారం రాత్రి రెండు హెలికాప్టర్లు గాలిలో ఢీకొని మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దట్టమైన పొగ కమ్ముకుంది. హామంటన్ పోలీస్ డిపార్ట్మెంట్ (Hamonton Police Department) తెలిపిన వివరాల ప్రకరాం.. ఒక హెలికాప్టర్ నేలపై కూలిపోయే సమయానికి మంటల్లో చిక్కుకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. రెండు హెలికాప్టర్లలో పైలట్లు మాత్రమే ఉన్నారు. దీంతో ప్రాణనష్టం తక్కువగా జరిగింది. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎన్స్ట్రోమ్ 280C హెలికాప్టర్, ఎన్స్ట్రోమ్ F-28A హెలికాప్టర్ ఉన్నాయి.