అక్షరటుడే, వెబ్‌డెస్క్: hackers arrest : గుజరాత్(Gujarat)లో ఇద్దరు హ్యాకర్లను ఏటీఎస్ అధికారులు అరెస్టు చేశారు. మైనర్ సహా అన్సారీని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు పలు భారత వెబ్‌సైట్లను హ్యాక్ చేసినట్లు గుర్తించారు. ఆపరేషన్ సింధూర్(Operation Sindhur) జరుగుతుండగా వెబ్‌సైట్లను హ్యాక్ చేసినట్లు తెలిసింది.
వెబ్‌సైట్లలో భారత వ్యతిరేక సందేశాలు పోస్ట్ చేసినట్లు నిర్ధారించారు. హ్యాకర్లు టెలిగ్రామ్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నట్లు వెలుగుచూసింది. 12వ తరగతి ఫెయిలైనా హ్యాకింగ్‌పై నిందితులకు పట్టు ఉండటం కొసమెరుపు. నిందితులను అరెస్టు చేసిన ఏటీఎస్ అధికారులు(ATS officials) వారి ఫోన్లను ఫోరెన్సిక్‌కు పంపారు.