అక్షరటుడే, నిజాంసాగర్: Pitlam | విద్యుదాఘాతంతో (Electric shock) ఇద్దరు రైతులు మృతి చెందిన ఘటన పిట్లం మండలంలో (Pitlam mandal) మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. రైతు ఆగమయ్య పొలం వద్ద బోరు మరమ్మతులు చేసేందుకు మరో ఇద్దరు రైతులు రాములు, హనుమయ్య వెళ్లారు. బోరు నుంచి పైపులు బయటకు తీస్తుండగా.. పైనున్న 11 కేవీ విద్యుత్ తీగలు తగలడంతో రాములు, హనుమయ్య మృతి చెందాడు. ఆగమయ్య తీవ్రంగా గాయపడినట్లు గ్రామస్థులు తెలిపారు. విషయం తెలుసుకున్న పిట్లం పోలీసులు (Pitlam Police) ఘటనా స్థలానికి వెళ్తున్నారు.
