HomeతెలంగాణHYD electric shock | మ‌రో విషాదం.. వినాయ‌క విగ్ర‌హాన్ని త‌ర‌లిస్తుండ‌గా క‌రెంట్ షాక్.. ఇద్ద‌రి...

HYD electric shock | మ‌రో విషాదం.. వినాయ‌క విగ్ర‌హాన్ని త‌ర‌లిస్తుండ‌గా క‌రెంట్ షాక్.. ఇద్ద‌రి దుర్మరణం

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: HYD electric shock : హైదరాబాద్‌(Hyderabad)లో తాజా జ‌రిగిన రెండు ప్ర‌మాదాలు అంద‌రినీ క‌లిచివేస్తున్నాయి. పండుగ‌ల స‌మ‌యంలో వారు ఇలా మృత్యువాత పడటం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

రామంతాపూర్‌(Ramanthapur), బండ్లగూడలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో విద్యుత్‌ షాక్‌(electric shock)తో ఏకంగా 7 మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

రామాంత‌పూర్(Ramanthapur) ఘట‌న మ‌రచిపోక‌ముందే బండ్లగూడ(Bandlaguda)లో జ‌రిగిన మ‌రో ఘ‌ట‌న ఇద్ద‌రు యువ‌కులు దుర్మ‌ర‌ణం చెందారు.

వినాయక చతుర్థి సందర్భంగా భారీ వినాయక విగ్రహాన్ని ట్రాక్టర్‌పై తీసుకెళ్తుండగా హఠాత్తుగా హైటెన్షన్ వైరు విగ్రహానికి తగిలింది.

HYD electric shock : వ‌రుస ప్రమాదాలు..

దీంతో ట్రాక్టర్‌కు విద్యుత్ షాక్ తగలడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల పేర్లు టోనీ (21), వికాస్ (20) కాగా మరొక యువకుడు అఖిల్ Akhil తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరాడు.

విద్యుత్‌ షాక్ తో ట్రాక్టర్‌ టైర్లు పూర్తిగా కాలిపోయాయి. క్రేన్ సాయంతో విగ్రహాన్ని తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

HYD electric shock : ఒక్కరోజు వ్యవధిలోనే..

ఈ ఘ‌ట‌నకి ముందు రోజే రామాంత‌పూర్‌లో కూడా కరెంట్ షాక్‌తో మృత్యువాత ప‌డ్డారు. రామంతాపూర్‌లోని గోఖలేనగర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకల (Sri Krishna Ashtami celebrations) సందర్భంగా నిర్వహించిన రథయాత్ర పెద్ద ప్రమాదానికి దారితీసింది.

శ్రీకృష్ణుడి విగ్రహంతో కూడిన రథాన్ని స్థానికులు చేతుల‌తో లాగుకుంటూ తీసుకెళ్తుండగా.. వేలాడుతున్న విద్యుత్ తీగ రథానికి తగిలింది. వెంటనే విద్యుత్ షాక్‌తో Electric Shock 9 మంది పడిపోయారు.

వీరిలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మిగిలిన న‌లుగురిని ఆసుపత్రికి తరలించారు. వర్షం పడుతున్న సమయంలో జరిగిన ఈ ఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది.

కొందరికి సీపీఆర్(CPR) చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ రెండు ఘటనలపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పండుగ వేడుకల సమయంలో ప్రాథమిక భద్రతా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ విధమైన ప్రాణనష్టం జరిగిందని స్పష్టం అవుతోంది.

అధికారులు, విద్యుత్ శాఖ, ఉత్సవ కమిటీల పర్యవేక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Must Read
Related News