5
అక్షరటుడే, ఇందల్వాయి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ- సీబీసీఎస్ పరీక్షల్లో ఇద్దరు డిబార్ అయ్యారని ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య గంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 30 సెంటర్లలో ఒకటో, మూడో, ఐదో, సెమిస్టర్ రెగ్యులర్, రెండో, నాల్గో,ఆరవ సెమిస్టర్ (2021, 2022, 2023, 2024, 2025 బ్యాచ్‌ల) బ్యాక్లాగ్ థియరీ పరీక్షలు జరుగుతున్నాయన్నారు.
తొమ్మిదో రోజు శనివారం ఉదయం జరిగిన పరీక్షలకు 5,317 మంది విద్యార్థులకు 5,068 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 5,799 మందికి 5,314 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ (Government Degree College) ఆర్మూర్‌లో ఇద్దరు డిబార్ అయ్యారని ఆయన వివరించారు.