Solar Power
Solar Power | సౌర విద్యుత్‌పై రెండు రోజుల శిక్షణ

అక్షరటుడే, ఇందూరు: Solar Power | నేషనల్‌ పవర్‌ ట్రైనింగ్‌ ఇన్‌ స్టిట్యూట్​ (National Power Training Institute) మినిస్ట్రీ ఆఫ్‌ పవర్‌ గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో పీఎం సూర్యఘర్‌ బిజిలీ యోజనపై డిస్కం ఇంజినీర్లకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం నగరంలోని పాలిటెక్నిక్‌ కళాశాల (Polytechnic College) నార్త్‌ బ్లాక్‌ సెమినార్‌ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి అధ్యక్షులుగా ఎస్‌ఈ ఆర్‌ రవీందర్, ముఖ్యఅతిథిగా పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ భారతి హాజరై మాట్లాడారు.

పట్టణాలతో పాటు గ్రామాల్లో పీఎం సూర్యఘర్‌ బిజిలీ యోజనపై ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. శిక్షకులుగా రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజినీర్‌ (ఏపీ సీపీడీసీఎల్​) దుర్గాప్రసాద్‌ నరేంద్ర కుమార్, రిటైర్డ్‌ ఎస్‌ఈ (టీజీ ఎస్పీడీసీఎల్, ఎన్‌పీటీఐ డిప్యూటీ డైరెక్టర్‌) బి వెంకట సుబ్బయ్య ఇంజినీర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజినీర్లు, అసిస్టెంట్‌ ఇంజినీర్లు, సబ్‌ ఇంజినీర్లు పాల్గొన్నారు.