అక్షరటుడే, వెబ్‌డెస్క్: Schools holiday | కామారెడ్డి జిల్లాను భారీ వర్షాలు(Heavy Rains) తీవ్రంగా అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
అనేక చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. కుండపోత వర్షాల కారణంగా ప్రజలు కాలు బయటపెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో గురువారం జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా.. మరో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్న నేపథ్యంలో విద్యాశాఖ (Education Department) కీలక నిర్ణయం తీసుకుంది. కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం, శనివారం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు.