
అక్షరటుడే, హైదరాబాద్: Critical Minerals : తెలంగాణలో (Telangana) మరో రెండు కీలక పరిశోధన కేంద్రాలు చేరబోతున్నాయి. అది కూడా హైదరాబాద్‌లోనే వాటి ఏర్పాటుకు శ్రీకారం చుడుతోంది కేంద్ర ప్రభుత్వం.
భారత్‌లో అత్యవసరంగా కావాల్సిన కీలక ఖనిజాలపై జరగనున్న పరిశోధనల నిమిత్తం కేంద్ర సర్కారు ఏడు కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. వీటిల్లో రెండు హైదరాబాద్‌కే దక్కడం విశేషం. ఈ రెండింటిలో IIT హైదరాబాద్(IIT Hyderabad)లో ఒకటి, హకీంపేట్(Hakimpet)లో ఉన్న – NFTDC (Non-Ferrous Technology Development Centre)లో మరోటి ఏర్పాటు చేస్తోంది.
Critical Minerals : అరుదుగా లభించే మినరల్స్ పై…
ఫ్యూచర్‌కి కావాల్సిన పవర్, స్పేస్ లాంచ్‌లు, బ్యాటరీలు, డిఫెన్స్ టెక్నాలజీలు ప్రత్యేకమైన మినరల్స్ మీద ఆధారపడి ఉంటాయి. ఆ ప్రత్యేకమైన వాటినే క్రిటికల్ మినరల్స్ గా పేర్కొంటారు. ఈ క్రిటికల్ మినరల్స్ అరుదుగా దొరుకుతాయి.
Critical Minerals : తీవ్ర డిమాండ్..
ఈ క్రిటికల్ మినరల్స్ కు ప్రపంచ వ్యాప్తంగా భారీగా డిమాండ్ ఉంది. ముఖ్యంగా అగ్ర రాజ్యాలు వీటి కోసం పోటీ పడుతుంటాయి. ఎందుకంటే ఎవరి వద్ద ఎక్కువగా ఇవి ఉంటే.. వారిదే పై చేయిగా భావిస్తుంటారు.
అందుకే భారత్ కూడా వీటిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్‌కు శ్రీకారం చుట్టింది. ఈ మిషన్ కోసం బడ్జెట్లో రూ. 16,300 కోట్లు కేటాయించింది. ఇంకో రూ.18,000 కోట్లు పీఎస్‌యూ(PSU)ల నుంచి తీసుకోనుంది. ఈ మేరకు మొత్తం IITలు, సైన్స్ ఇన్‌స్టిట్యూట్లతో కలిసి హార్డ్‌కోర్ పరిశోధన చేయబోతోంది. ఇందులో భాగంగా తెలంగాణకు రెండు కేంద్రాలు రాబోతున్నాయి.
ఈ కేంద్రాల ఏర్పాటుతో ఈ రంగంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. పరిశోధనా ఫలాలు అందనున్నాయి. స్టార్టప్ అవకాశాలు కలగనున్నాయి. మొత్తానికి వీటికి ప్రధాన మార్గంగా మారనున్నాయి.