అక్షరటుడే, ఇందూరు: Minority colleges | మైనారిటీ గురుకులాల విద్యాసంస్థలు(టెమ్రిస్) ఆధ్వర్యంలో ఉమ్మడిజిల్లాకు సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ (సీఓఈ) (Center of Excellence) కళాశాలలు రెండు మంజూరయ్యాయి. ఈ మేరకు టెమ్రిస్ సెక్రటరీ షఫీయుల్లా ఉత్తర్వులు జారీ చేశారు.
సీఓఈ కళాశాలల్లో నాగారంలో (Nagaram) బాలుర కోసం, బాలికల కోసం ధర్మపురి హిల్స్‌లో (Dharmapuri Hills) మదీనా ఈద్గాలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు టెమ్రిస్ ఉమ్మడి జిల్లా ఆర్ఎస్సీ బషీర్ పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా మైనారిటీ కేటగిరీకి చెందిన (ముస్లింలు, క్రిస్టియన్లు, పార్సీలు, జైనులు, సిక్కులు) వారితోపాటు నాన్ మైనారిటీ కోటా కింద (ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ) అర్హత కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు అర్హులన్నారు. దరఖాస్తులు సమర్పించడానికి ఈనెల 29 వరకు గడువు ఉందని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు మైనారిటీ గురుకులాల ప్రిన్సిపాల్ సయ్యద్ హైదర్ 8985783112, ఆయేషా 8555030851, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రాంతీయ సమన్వయాధికారి బషీర్ 9849419469 నంబర్లలో సంప్రదించాలని వెల్లడించారు.