Banswada | బావిలో పడి ఇద్దరు పిల్లలకు గాయాలు
Banswada | బావిలో పడి ఇద్దరు పిల్లలకు గాయాలు

అక్షరటుడే, బాన్సువాడ:Banswada | బావి(Well)లో పడి ఇద్దరు పిల్లలకు గాయాలైన ఘటన పట్టణంలోని సంగమేశ్వర్ కాలనీ(Sangameshwar Colony)లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీలో శుక్రవారం రాత్రి పిల్లలు కలిసి ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో రింగులతో ఏర్పాటు చేసిన బావి సిమెంట్ పైకప్పుపై ఆడుకుంటుండగా.. ఒక్కసారిగా కూలిపోవడంతో అందులో పడిపోయారు. దీంతో ఇర్ఫాన్(7), రహేల(7) చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రి(Nizamabad Hospital)కి తరలించారు. ఇర్ఫాన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.