అక్షరటుడే,ఇందల్వాయి: Indalwai | రెండు కార్లు ఢీకొన్న ఘటన జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సదాశివనగర్ (sadashiv nagar) మండల డిప్యూటీ తహశీల్దార్ తిరుపతి భూభారతి (Bhubarathi) కార్యక్రమంలో పాల్గొనేందుకు మోడేగాం గ్రామానికి కారులో వెళ్తున్నారు. 44వ జాతీయ రహదారిపై చంద్రాయన్పల్లి (Chandrayanpalli) శివారులో ఆయన కారు యూటర్న్ తీసుకుంటున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు కార్లు స్వల్పంగా ధ్వంసం కాగా.. ఎవరికీ గాయాలు కాలేదు.
