81
అక్షరటుడే, భీమ్గల్: Bheemgal | రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన భీమ్గల్ పట్టణంలోని (Bheemgal Town) వేల్పూర్ చౌరస్తా వద్ద మంగళవారం చోటు చేసుకుంది.
Bheemgal | ఎదురెదురుగా..
రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా వచ్చి బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితులను ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామానికి చెందిన గంగారాం, ఎల్లయ్యగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ‘108’కు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ‘108’ సిబ్బంది ఈఎంటీ త్రిషాల, పైలట్ తిరుపతి గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు.