అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Police Promotions | నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు ఏఎస్సైలకు ఎస్సైలుగా పదోన్నతి లభించింది. ఈమేరకు రాష్ట్ర డీజేపీ (Telanagana DGP) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు ఎస్సైలు సీపీ సాయిచైతన్యను (CP Sai Chaitanya) మర్యాదపూర్వకంగా కలిశారు. సీపీ వారికి బ్యాడ్జీలను అందజేశారు.
గత కొంతకాలంగా ప్రమోషన్ల ఎదురుచూస్తున్న ఏఎస్సైలకు ప్రమోషన్లు రావడంతో వారిలో ఆనందం వ్యక్తమైంది. మాక్లూర్(makloor) పీఎస్ ఏఎస్సై గంగాధర్ ఎస్సైగా ప్రమోషన్ పొంది జగిత్యాలకు (jagityal) ట్రాన్స్ఫర్ అయ్యారు. అలాగే నగరంలోని ఐదోటౌన్ ఏఎస్సై రమేష్ ఎస్సైగా ప్రమోషన్ పొంది నిర్మల్‌కు (Nirmal) బదిలీపై వెళ్లారు.
Police Promotions | కమిషనరేట్ పరిధిలో ప్రమోషన్లు
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులకు ప్రమోషన్లు దక్కాయి. నేడు ఇద్దరు ఏఎస్సైలకు పదోన్నతి లభించగా.. ఇప్పటికే జిల్లాలో తొమ్మది మంది కానిస్టేబుళ్లకు సైతం హెడ్‌కానిస్టేబుళ్లుగా (Head constables) ప్రమోషన్ లభించిన విషయం తెలిసిందే.