అక్షరటుడే, బాల్కొండ: Balkonda Police | దర్జాగా గంజాయిని తాగుతున్న వ్యక్తిని, విక్రేతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు బాల్కొండ పోలీసులు (Balkonda police) వివరాలు వెల్లడించారు.
Balkonda Police | చిట్టాపూర్ గ్రామానికి చెందిన..
పక్కా సమాచారం మేరకు చిట్టాపూర్ గ్రామానికి (Chittapur village) చెందిన ఓ వ్యక్తి గంజాయి సిగరెట్ తాగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నిర్వహించిన పరీక్షలో పాజిటివ్ రావడంతో అతడిని విచారించారు. గంజాయి కొనుగోలుపై ఆరా తీయగా నిర్మల్ జిల్లా (Nirmal district) లోకేశ్వరం మండలం మోహల్లా గ్రామానికి చెందిన లాలప్ప వద్ద గంజాయి కొనుగోలు చేసినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు లాలప్ప ఇంట్లో తనిఖీలు నిర్వహించగా 584 గ్రాముల ఎండు గంజాయి దొరికింది. అలాగే అతడి పెరట్లో ఒక గంజాయి మొక్క కూడా లభ్యమైంది. వాటిని సీజ్ చేసి ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై శైలేందర్ తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.