అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులతో పాటు వాటిని కొనుగోలు చేసిన మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. నగరంలోని క్రైం బ్రాంచ్ పోలీస్ స్టేషన్లో (Crime Branch Police Station) ఆయన మీడియాతో మాట్లాడారు.
కొంతమంది వ్యక్తులు ముఠాగా ఏర్పడి బోధన్ (Bodhan), నిజామాబాద్, ఆర్మూర్ (Armoor), ముధోల్ ప్రాంతాల్లో ఆటోలు, బైక్‌లు చోరీ చేసి కోరుట్ల, జగిత్యాల్ ప్రాంతాల్లో అమ్ముతున్నారనే పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడులు చేశారు. నగరంలోని ఆటోనగర్‌కు చెందిన షేక్ ఫజిల్ (25), మహమ్మద్ నవాజ్ (23)లను అదుపులోకి తీసుకొని విచారించగా నిజామాబాద్‌కు చెందిన షేక్ అలీ, హలీం, వాయి కలిసి 9 ఆటోలు మూడు బైక్‌లను చోరీ చేశారని ఒప్పుకున్నారు.
చోరీ చేసిన వాహనాల సెంటర్ ప్లేట్లను మార్చి వాటిని కోరుట్లలోని (Korutla) మహమ్మద్ ఇమ్రాన్, మహమ్మద్‌లకు అమ్మేవారని తెలుపగా వారిని సైతం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఒక ఆటో రికవరీ చేసి వారిచ్చిన సమాచారం మేరకు వారి వద్ద నుంచి 9 ఆటోలు 3 బైక్‌లు రికవరీ చేశారు. రికవరీ చేసిన దొంగ వాహనాలను పరిశీలించగా నాలుగు ఆటోలు మూడు బైక్‌ల సమచారం లభించింది. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు.
వీరిపై బోధన్, ఆర్మూర్ బైంసా, ముథోల్ (Muthol) పోలీస్ స్టేషన్లలో పలు చోరీ కేసులు నమోదై ఉన్నాయని సీపీ వివరించారు. కొనుగోలు చేసిన వాహనాలను తర్వాత అమ్ముకుందామని బోధన్‌లోని శక్కర్‌నగర్ రైల్వేస్టేషన్ దగ్గర నిర్మానుష్య ప్రదేశంలో దాచిపెట్టారు. ఈ వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. వాహనాలను చోరీ చేసిన ఇద్దరు నిందితులతో పాటు వాహనాలు కొనుగోలు చేసిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీపీ పేర్కొన్నారు.