Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | జల్సాలకు అలవాటు పడి చోరీలు.. నిందితుల అరెస్ట్​

Nizamabad City | జల్సాలకు అలవాటు పడి చోరీలు.. నిందితుల అరెస్ట్​

జల్సాల కోసం చోరీలు, దోపిడీలు చేస్తున్న ఇద్దరిని వన్​ టౌన్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. చోరీ సొత్తు అమ్మేందుకు యత్నించగా పట్టుకున్నట్లు వన్​ టౌన్​ ఎస్​హెచ్​వో రఘుపతి తెలిపారు.

- Advertisement -

అక్షర టుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | దొంగలించిన సొమ్మును విక్రయించేందుకు యత్నించిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి (SHO Raghupathi) తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని కోజా కాలనీకి చెందిన అతర్ బైగ్(21), షేక్ అజ్మాద్ (24) చెడు అలవాట్లకు బానిసగా మారారు.

ఈ క్రమంలో జల్సాలకు డబ్బు సరిపోవడం లేదని ఒంటరిగా కనిపించిన వారిని బెదిరించి దారి దోపిడీకి పాల్పడడం, ఇళ్లలో చోరీలకు (House Robberies) పాల్పడేవారు. ఇందులో భాగంగానే గత నెల 31న ఎరుకలవాడలోని ఓ ఇంట్లో బీరువా పగలగొట్టి బంగారు ఆభరణాలు, నగదు, సెల్ ఫోన్ అపహరించుకు పారిపోయారు. చోరీ సొత్తును అమ్మేందుకు ఆదివారం గంజ్ మార్కెట్(Ganj market)లో అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు.

దీంతో పోలీసులు వారిని పట్టుకుని వారి వద్ద నుంచి బంగారు ముక్కు పుడక ఉంగరం, వెండి కడియాలు, ఒత్తులు, స్మార్ట్ ఫోన్, రూ.1500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారిని అరెస్ట్​ చేశామని, ఇదివరకే వీరిపై చోరీ, హత్యాయత్నం కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. అతర్ బైగ్ నెలన్నర క్రితమే జైలు నుంచి బయటకు వచ్చారు. కేసును చేధించడంలో ముఖ్య పాత్ర వహించిన వన్ టౌన్ ఎస్సై జి మహేష్, ఏఎస్సై షకీల్, కానిస్టేబుల్ గంగారాం, ప్రభురాజ్​ను ఏసిపీ రాజా వెంకట్ రెడ్డి అభినందించారు.