అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Task Force Police | గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను టాస్క్ఫోర్స్ అధికారులు అరెస్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు డిస్ట్రిక్ట్ టాస్క్ఫోర్స్ నిజామాబాద్ సీఐ (Nizamabad Task Force CI) సీహెచ్ విలాస్, ఎస్సై సింధు (SI Sindhu) ఆధ్వర్యంలో నవీపేట్ రైల్వేస్టేషన్ (Navipet Railway station) శివాజీచౌక్ వద్ద తనిఖీలు చేపట్టారు. దర్యాపూర్ గ్రామానికి చెందిన పురుషోత్తం, ఖురేషి చోటు మియా అనే ఇద్దరు వ్యక్తుల వద్ద క్యారీ బ్యాగుల్లో ఒక్కొక్కరి వద్ద 200 గ్రాముల చొప్పున మొత్తం 400 గ్రాముల ఎండు గంజాయిని పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి నిజామాబాద్ పోలీసులకు అప్పగించారు. దాడుల్లో సిబ్బంది చంద్ర మోహన్, నీలీరాజు, కిరణ్ కుమార్, నర్సయ్య చారి, సాగర్రావు, సలీం, భూమేశ్వర్, గోపి, కార్తీక్, దశ పాల్గొన్నారు.
Task Force Police | గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
4
previous post