ePaper
More
    HomeతెలంగాణDouble Bed Room Houses | డబుల్ బెడ్​ రూం ఇళ్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు.....

    Double Bed Room Houses | డబుల్ బెడ్​ రూం ఇళ్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు.. ఇద్దరి అరెస్ట్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Double Bed Room Houses  డబుల్​ బెడ్​ రూం ఇళ్లు ఇప్పిస్తామని ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్​ చేశారు. కుత్బుల్లాపూర్ (Qutubullahpur) ఎమ్మెల్యే వివేకానందగౌడ్​ (MLA Vivekananda Goud) అనుచరలమని, బీఆర్​ఎస్​ కార్యకర్తలమని చెప్పుకుంటూ ఇద్దరు వ్యక్తులకు ప్రజలను మోసం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

    ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి జి శ్రీధర్​, ప్రదీప్​ ప్రసాద్​ అనే వ్యక్తులను ప్రజల నుమచి డబ్బులు వసూలు చేస్తున్నారు. అంతేగాకుండా ఇళ్లు మంజూరు చేసినట్లు నకిలీ లేఖలు వారికి అందజేశారు. అయితే ఎంతకు ఇల్లు రాకపోవడంతో కె మల్లేశ్వరి అనే మహిళ జి శ్రీధర్​పై ఈ నెల 23న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీధర్​తో పాటు అతడికి సహకరిస్తున్న ప్రదీప్​ను సోమవారం సుచిత్ర (Suchitra)లో అరెస్ట్ చేశారు.

    READ ALSO  Hyderabad | 12 రోజుల తర్వాత ఎట్టకేలకు చిక్కిన చిరుత..

    Double Bed Room Houses | ఎమ్మెల్యే పేరు చెప్పి..

    నిందితులు కుత్బుల్లాపూర్​ ఎమ్మెల్యే పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్నారు. తమకు ఎమ్మెల్యే వివేకానందగౌడ్​ సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ప్రజలను నమ్మించేవారు. రాజకీయ నాయకులతో ఉన్న ఫొటోలను ప్రజలకు చూపించేవారు. తమకు డబ్బులు కడితే డబుల్​ బెడ్​ రూం​ ఇల్లు ఇప్పిస్తామని నమ్మ బలికేవాడు. ప్రాసెసింగ్, రిజిస్ట్రేషన్ ఫీజులు, ఇతర ఖర్చులు ఉంటాయని డబ్బులు వసూలు చేసేవారు. అనంతరం బాధితులకు నకిలీ మంజూరు పత్రాలు (Fake Letters) జారీ చేసేవారు. ఈ క్రమంలో ఓ మహిళ ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి నుంచి నకిలీ లేఖలు, కారు, ల్యాప్‌టాప్, కంప్యూటర్, వెబ్‌క్యామ్, ప్రింటర్, స్కానర్, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

    READ ALSO  Hyderabad | కిడ్నాపర్ల చెరలో భర్త.. రూ.10 లక్షలు డిమాండ్​.. ఇవ్వనని తేల్చి చెప్పిన భార్య..!

    Double Bed Room Houses | ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్​ సహాయకుడు అరెస్ట్​

    డబుల్​ బెడ్​ రూం ఇళ్ల పేరిట మోసాలకు పాల్పడుతున్న కుత్బుల్లాపూర్​ ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీసు సహాయకుడిని ఇటీవల అరెస్ట్​ చేసిన విషయం తెలిసిందే. జులై 23న బోడిమి శెట్టి హరిబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డబుల్​ బెడ్​ రూం ఇళ్లు ఇప్పిస్తానని హరిబాబు 84 మంది నుంచి రూ.లక్ష చొప్పున వసూలు చేసినట్లు ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఇల్లు మంజూరు చేయకపోగా.. డబ్బులు సైతం తిరిగి ఇవ్వలేదు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుత్బుల్లాపూర్​ నియోజకవర్గంలో డబుల్ ఇళ్ల వ్యవహారంలో ముగ్గురు అరెస్ట్​ కావడం తీవ్ర చర్చకు దారి తీసింది.

    Latest articles

    Minister Ponguleti | కార్పొరేట్ స్థాయిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు : మంత్రి పొంగులేటి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Ponguleti | సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో (At the Sub-Registrar's offices) సకల...

    Dichpally | డబ్బులు తీసుకుని ఐపీ పెట్టడం సరికాదు

    అక్షరటుడే, డిచ్ పల్లి: Dichpally | డిచ్​పల్లికి చెందిన ఓ వ్యాపారి తమ వద్ద డబ్బులు తీసుకుని, ఐపీ...

    Sports Policy | యువత డ్రగ్స్​కు బానిస కావడం ఆందోళనకరం : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sports Policy | రాష్ట్రంలో యువత ముఖ్యంగా విద్యార్థులు గంజాయి, డ్రగ్స్​ వంటి మాదకద్రవ్యాలకు...

    Kamareddy | సోషల్ మీడియా వేదికగా దోపిడీ.. ముఠా ఆటకట్టించిన పోలీసులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అమాయకులను బెదిరిస్తూ డబ్బులు దోచుకుంటున్న ఐదుగురు సభ్యుల...

    More like this

    Minister Ponguleti | కార్పొరేట్ స్థాయిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు : మంత్రి పొంగులేటి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Ponguleti | సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో (At the Sub-Registrar's offices) సకల...

    Dichpally | డబ్బులు తీసుకుని ఐపీ పెట్టడం సరికాదు

    అక్షరటుడే, డిచ్ పల్లి: Dichpally | డిచ్​పల్లికి చెందిన ఓ వ్యాపారి తమ వద్ద డబ్బులు తీసుకుని, ఐపీ...

    Sports Policy | యువత డ్రగ్స్​కు బానిస కావడం ఆందోళనకరం : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sports Policy | రాష్ట్రంలో యువత ముఖ్యంగా విద్యార్థులు గంజాయి, డ్రగ్స్​ వంటి మాదకద్రవ్యాలకు...