Homeజిల్లాలునిజామాబాద్​Bodhan | బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్ట్

Bodhan | బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్ట్

బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు బోధన్ పట్టణ సీఐ వెంకట్ నారాయణ తెలిపారు. అంబేద్కర్ చౌరస్తాలో ఆదివారం వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు.

- Advertisement -

అక్షర టుడే, బోధన్: Bodhan | బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు బోధన్ పట్టణ సీఐ వెంకట్ నారాయణ (Bodhan town CI Venkat Narayana) తెలిపారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆదివారం వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు.

వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. నిజామాబాద్ నగరానికి (Nizamabad city) చెందిన మహ్మద్ జావిద్, బోధన్​కు చెందిన ఇక్బాల్​గా గుర్తించామన్నారు. వీరిద్దరూ కలిసి బోధన్, నిజామాబాద్ ప్రాంతాల్లో బైకుల దొంగతనానికి పాల్పడుతున్నట్లు తేలిందన్నారు. వీటిని డూప్లికేట్ నంబర్ ప్లేట్​తో విక్రయిస్తుంటారని పేర్కొన్నారు. వారి వద్ద నుంచి ఒక బుల్లెట్ వాహనాన్ని, డూప్లికేట్ ఆర్సీలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇద్దరిని రిమాండ్​కు తరలించామని సీఐ తెలిపారు.