అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Liquor Shops | జిల్లాలో 2025-27కు గాను మద్యం టెండర్ల (liquor tenders) దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలో రెండు దరఖాస్తులు వచ్చాయి.
Liquor Shops | ఏయే షాపుల కోసం అంటే..
నందిపేట మండలానికి (Nandipet mandal) చెందిన కోరేపల్లి రంజిత నందిపేట వైన్స్ కోసం దరఖాస్తు వేశారు. అలాగే మండలంలోని ఆంధ్ర నగర్‌కు చెందిన జి.శ్రీనివాస్ రావు సిరికొండ మండలం (Sirikonda mandal) మైలారం గ్రామ వైన్స్‌కు దరఖాస్తు చేశారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, సీఐ స్వప్న, భీమ్‌గల్ సీఐ వేణుమాదవ్, నిజామాబాద్ ఎస్సై గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.