YellaReddy SI
YellaReddy SI | పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల అరెస్ట్‌

అక్షరటుడే, ఎల్లారెడ్డి: YellaReddy SI | కేసుల్లో కోర్టు విచారణకు హాజరు కాకుండా పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు ఎల్లారెడ్డి ఎస్సై (yellareddy SI | ) తెలిపారు. లింగంపేట్‌ మండలం రాంపూర్‌ తండాకు చెందిన ధరావత్‌ రమేశ్, బాన్సువాడ మండలం కొయ్యగుట్టకు చెందిన మక్కల గంగాధర్‌ కోర్టు విచారణలకు హాజరు కాకపోవడంతో, కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీచేసింది. దీంతో ఈ మేరకు సోమవారం నిందితులను అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. అనంతరం ఎల్లారెడ్డి కోర్టులో హాజరుపరచి, కామారెడ్డి జైలుకు తరలించినట్లు వెల్లడించారు.