Homeతాజావార్తలుSSMB 29 | మిడ్ నైట్ ‘SSMB 29’పై సోషల్ మీడియాలో మహేష్ – రాజమౌళి...

SSMB 29 | మిడ్ నైట్ ‘SSMB 29’పై సోషల్ మీడియాలో మహేష్ – రాజమౌళి ట్వీట్ వార్.. ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ హామీ!

మహేష్ – రాజమౌళి జోడీ ఆన్‌లైన్ వేదిక‌గా చేసిన ట్విట్ట‌ర్ ఫైట్ ఫ్యాన్స్ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేసింది. ఇప్పుడు అందరి దృష్టి SSMB 29 అప్డేట్ పైనే ఉంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : SSMB 29 | ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ల తర్వాత దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి (S.S.Rajamouli) తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘SSMB 29’ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇది వర్కింగ్ టైటిల్ మాత్రమే అయినప్పటికీ, ఈ పేరు ఇప్పటికే దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు (superstar Mahesh Babu) హీరోగా నటిస్తున్న ఈ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్‌పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవల మహేష్ బాబు ప్రీ-లుక్ పోస్టర్ విడుదల కావడంతో మూవీపై ఆసక్తి మరింత పెరిగింది. ఆ పోస్టర్‌లో మహేష్ మెడలో పరమశివుని త్రిశూలం, ఢమరుకం, రుద్రాక్ష, నంది ఆకృతులతో కూడిన లాకెట్ ధరించిన లుక్ చూపించడంతో అభిమానులు సినిమాకి ఆధ్యాత్మిక, మిస్టికల్ టచ్ ఉందని ఊహిస్తున్నారు.

SSMB 29 | నాశ‌నం చేశావుగా..

అయితే ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న ఫస్ట్ లుక్ అప్‌డేట్ ఇంకా రాలేదు. ఈ క్రమంలోనే మహేష్ బాబు ట్విట్టర్‌లో జక్కన్నను ట్యాగ్ చేస్తూ వరుస ట్వీట్లు చేయడం, రాజమౌళి కూడా ఫన్నీ కౌంటర్లు ఇవ్వడం సోషల్ మీడియాలో హీట్ క్రియేట్ చేసింది. రాజమౌళి గతంలో మహేష్ పుట్టినరోజు (Mahesh Babu birthday) సందర్భంగా “నవంబర్‌లో అప్డేట్ వస్తుంది” అని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. నవంబర్ రాగానే ఫ్యాన్స్ #noveMBerwillbehiSStoRic, #noveMBer హ్యాష్‌ట్యాగ్‌లతో సోషల్ మీడియా షేక్ అవుతుంది.

ఈ ఉత్సాహానికి తోడు మహేష్ బాబు కూడా “ఆల్రెడీ నవంబర్ వచ్చేసింది” అంటూ రాజమౌళికి రిమైండ్ చేశారు. దానికి రాజమౌళి సరదాగా “అవును మహేష్.. ఈ నెలలో ఏ సినిమాలకు రివ్యూ ఇవ్వాలని అనుకుంటున్నావు?” అని అడగ్గా, మహేష్ బాబు పంచ్ వేస్తూ “మీరు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్న మహాభారతం సినిమాకి (Mahabharata movie) ఇస్తాను సర్” అని జవాబిచ్చారు.

“మీ మాట నిలబెట్టుకోండి, నవంబర్‌లో ఏదో హామీ ఇచ్చారు కదా!” అని మహేష్ పట్టుబట్ట‌గా, రాజమౌళి “ఇప్పుడే కదా మొదలైంది.. ఒక్కొక్కటిగా వెల్లడిస్తాము” అని చెప్పి ఫ్యాన్స్ ఉత్కంఠను మరింత పెంచేశారు. ఇదే సమయంలో మహేష్ సరదాగా “ఎంత నెమ్మదిగా ఇస్తారు సార్? 2030లో స్టార్ట్ చేద్దామా?” అని రాసి సంచలనంగా ప్రియాంక చోప్రా (Priyanka Chopra) పేరును ప్రస్తావిస్తూ “మన దేశీ పాప ప్రియాంక చోప్రా జనవరి నుంచి హైదరాబాద్‌లో ప్రతి వీధిలో తన ఇన్‌స్టా స్టోరీలు పోస్ట్ చేస్తోంది” అన్నారు.

దాంతో ప్రియాంక చోప్రా వెంటనే స్పందించి “హలో హీరో.. సెట్‌లో నువ్వు నాతో పంచుకునే కథలన్నీ నేనే లీక్ చేయాలా? మైండ్‌లో ఫిక్స్ అయితే బ్లైండ్‌గా ఏసేస్తా!” అంటూ మహేష్‌కి ఫన్నీ కౌంటర్ ఇచ్చింది. ఇక రాజమౌళి “మహేష్, నువ్వు సర్‌ప్రైజ్ నాశనం చేశావ్! ప్రియాంక చోప్రా పాత్రను రహస్యంగా ఉంచాలనుకున్నాం” అన్నారు. కానీ మహేష్ ఆగలేదు. “సర్‌ప్రైజా? మీ ఉద్దేశ్యంలో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కూడా సర్‌ప్రైజ్ అని చెప్పాలనుకుంటున్నారా?” అంటూ మరో లీక్ ఇచ్చేశారు.

దాంతో పృథ్వీరాజ్ కూడా ఎంటర్ అవుతూ “రాజమౌళి సార్, నేను ఇలా హైదరాబాద్ వెకేషన్ అని తిరిగితే నా ఫ్యామిలీ నన్ను అనుమానించడం మొదలు పెడుతుంది” అంటూ సరదాగా ట్వీట్ చేశారు. దానికి రాజమౌళి “మహేష్, నువ్వు అన్నీ నాశనం చేశావ్” అని సరదాగా కోపగించుకోగా, మహేష్ “సరే, అందరికీ తెలిసిన విషయాన్నే రేపు ప్రకటించండి, దాన్ని మీరు సర్‌ప్రైజ్ అనుకుంటే ఓకే!” అని ఫన్నీగా ముగించారు. దాంతో రాజమౌళి “డీల్ ఓకే, కానీ అతిగా వ్యంగ్యంగా మాట్లాడినందుకు జరిమానాగా నీ ఫస్ట్ లుక్ విడుదలను ఆలస్యం చేస్తున్నాను” అంటూ ట్వీట్ చేయడంతో ఫ్యాన్స్ నవ్వుల్లో మునిగిపోయారు.ఈ సరదా ట్వీట్ వార్‌తో సోషల్ మీడియాలో SSMB 29 మళ్లీ వైరల్ అయింది.