అక్షరటుడే, వెబ్డెస్క్: Bhuvanagiri | రైలు నుంచి పడి నవ దంపతులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే వారు జారి పడి మృతి చెందారని తొలుత భావించారు. కానీ రైలులో నుంచి దూకినట్లు తెలిసింది.
ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లా (Parvathipuram Manyam district) గరుగుబిల్లి మండలం రావుపల్లికి చెందిన సింహాచలం(25)కు, అదే జిల్లాలోని అంకవరం గ్రామానికి చెందిన భవాని(19)కి వివాహం జరిగింది. రెండ నెలల క్రితం వివాహం కాగా.. దంపతులు హైదరాబాద్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. విజయవాడలోని (Vijayawada) బంధువుల ఇంటికి వెళ్లడానికి సింహాచలం, భవాని బయలుదేరారు. వీరు గురువారం రాత్రి సికింద్రాబాద్లో మచిలీపట్నం ఎక్స్ప్రెస్ (Machilipatnam Express) ఎక్కారు.
Bhuvanagiri | రైలులో గొడవ..
యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri district) వంగపల్లి – ఆలేరు రైలుమార్గంలో కింద పడి నవ దంపతులు చనిపోయారు. ఈ ఘటనకు ముందు రైలులో భవాని, సింహాచలం గొడవ పడ్డారు. దీంతో క్షణికావేశంలో భవాని రైలులో నుంచి దూకేసింది. వెంటనే భయంతో సింహాచలం సైతం కిందకు దూకాడు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వారు గొడవ పడే వీడియోను ఓ ప్రయాణికుడు వీడియో తీయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లయిన రెండు నెలలకే దంపతులు మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.