Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | కుంటలో పడి కవలలు మృతి.. తిమ్మక్​పల్లిలో విషాదం

Kamareddy | కుంటలో పడి కవలలు మృతి.. తిమ్మక్​పల్లిలో విషాదం

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | కుంటలో పడి ఇద్దరు కవల పిల్లలు మృతి చెందారు. ఈ ఘటన కామారెడ్డి మండలం తిమ్మక్​పల్లి గ్రామంలో (Thimmakpalli village) సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్థుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గుర్రాల పెద్ద నర్సింలు మంజుల దంపతులకు రామ్​, లక్ష్మణ్​ అనే కవల పిల్లలు ఉన్నారు. ఇద్దరు ఎనిమిదో తరగతి చదువుతున్నారు.

రామ్, లక్ష్మణ్​ సోమవారం సాయంత్రం స్కూల్ నుంచి తిరిగి రాగానే బయటకు వెళ్లారు. వినాయక చవితి (Vinayaka Chavithi) సందర్భంగా గ్రామంలో స్నేహితులతో కలిసి చందా కోసం వెళ్లి ఉంటారని తల్లిదండ్రులు భావించారు. రాత్రి 10 గంటలు దాటినా ఇంటికి రాకపోయేసరికి గ్రామంలో వెతికారు. చివరికి గ్రామ శివారులో ఉన్న కుంట ఒడ్డుపై ఇద్దరి బట్టలు కనిపించడంతో కుంటలో వెతికారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని కుంటలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో ఒక బాలుడి మృతదేహం లభించింది. మంగళవారం ఉదయం గాలింపు చేపట్టగా మరొక మృతదేహం లభ్యమైంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జీజీహెచ్​కు (Kamareddy GGH) తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Kamareddy | గుంతలలో ఊపిరిరాడక

చెరువులు, కుంటలలో నీటి నిలువ ఉండటం కోసం గుంతలు తీస్తుంటారు. అదే విధంగా గ్రామంలో సైతం ఇటీవల కుంటలో అక్కడక్కడా గుంతలు తీసినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఇద్దరు చిన్నారులు ఈత కొడుతూ (swimming) గుంతలో మునిగి ఊపిరాడక చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు.

Kamareddy | ఒకేసారి జననం.. ఒకేసారి మరణం

గ్రామానికి చెందిన గుర్రాల పెద్ద నర్సింలు మంజుల దంపతులకు ఇద్దరు కవలలే (two twins) సంతానం. నర్సింలు రోజువారీ మేస్త్రీ పని చేస్తుండగా.. మంజుల బీడీలు చేస్తూ కుటుంబాన్ని పోషిన్నారు. ఇద్దరి కష్టార్జితంతో ఉన్నదాంట్లో సంతోషంగా గడుపుతూ ఇద్దరు కొడుకులను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. తమ భవిష్యత్తు పిల్లలతోనే అని కలలు కన్నారు. ఒకేసారి పుట్టిన ఇద్దరు పిల్లలు ఒకేసారి మరణించడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఒకేసారి ఇద్దరు బాలురు మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.