అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mumbai-Pune Express Highway | మహారాష్ట్రలో (Maharashtra) ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్ హైవేపై (Mumbai-Pune Express Highway) శనివారం వరుసగా 20 వాహనాలు ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో 17 మందికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలోని ఖలాపూర్ తాలూకా ఖోపోలి పోలీస్ స్టేషన్ (Khopoli police station) పరిధిలో ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేపై శనివారం మధ్యాహ్నం వాహనాలు ఢీకొన్నాయి. అడోషి టన్నెల్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే బ్రేక్ ఫెయిల్ తర్వాత ట్రక్కు నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
Mumbai-Pune Express Highway | భారీగా ట్రాఫిక్ జామ్
కంటైనర్ డ్రైవర్ నియంత్రణ కోల్పోయి వాహనాలను ఢీకొన్నాడు. ఈ క్రమంలో వాహనాలు ఒక దానిని ఒకటి ఢీకొన్నాయి. వర్షం కారణంగా ప్రమాద తీవ్రత పెరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో హైవే భారీగా ట్రాఫిక్ జామ్ (massive traffic jam) అయింది. ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.