అక్షరటుడే, గాంధారి: KCR KIT | కేసీఆర్ కిట్ కోసం ఓ వ్యక్తి కేటీఆర్కు (KTR) ట్వీట్ చేయడంతో, స్పందించిన కేటీఆర్ స్థానిక మాజీ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి విషయం తెలిపారు. దీంతో స్థానిక నాయకుల ద్వారా సదరు వ్యక్తికీ కేసీఆర్ కిట్ అందజేశారు.
వివరాల్లోకి వెళితే.. గాంధారి మండలానికి చెందిన భవితకు ఇటీవల బాబు జన్మించగా డెలివరీ సమయంలో కేసీఆర్ కిట్ అందజేయలేదు. దీంతో బీఆర్ ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS State Working President KTR) కు ఎక్స్ ద్వారా ట్వీట్ చేశాడు.
దీంతో వెంటనే స్పందించిన కేటీఆర్ ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ తో (Former MLA from Yella Reddy Jajala Surender) మాట్లాడి కిట్ ను వారి ఇంటికి అందజేశారు. ఈ సందర్భంగా దంపతులు కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పత్తి శ్రీనివాస్, రెడ్డి రాజులు, కొమ్ముల రమేష్, తదితరులు పాల్గొన్నారు.