అక్షరటుడే, వెబ్‌డెస్క్ : TVS Sport Bike | ఇటీవలి కాలంలో ఇండియన్స్ ఎక్కువగా మోటర్ బైక్స్(Motor bikes) వినియోగిస్తున్నారు. తగ్గుతున్న ప్రజారవాణా సౌకర్యాల కారణంగా ప్రతి ఇంటికి ఓ బైక్ గానీ, స్కూటర్ (Scooter)గానీ ప్రతి ఒక్కరూ కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్ కొనుగోలు చేస్తుండడం మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే టీవీఎస్ ఎంట్రీ లెవల్ కమ్యూటర్ బైక్ అయిన టీవీఎస్ స్పోర్ట్ బైక్(TVS Sport Bike) అప్‌డేట్ వెర్షన్ అయిన ఈఎస్ ప్లస్ వేరియంట్(ES Plus Variant)ను లాంచ్ చేసింది. టీవీఎస్ మోటార్ కంపెనీ 2025 ఎడిషన్ టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది.
TVS Sport Bike | వీటిపై లుక్కేయండి..
టీవీఎస్ కంపెనీ(TVS Company) ఎంట్రీ-లెవల్ కమ్యూటర్ బైక్ అయిన స్పోర్ట్ కు Sports కొత్త అప్డేట్ ఇచ్చి 2025 స్పోర్ట్ ఈఎస్ ప్లస్ వేరియంట్‌ను విడుదల చేయగా, ఈ కొత్త మోడల్ ధర రూ.59,881 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఈ బైక్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే మోడల్‌లో పెద్దగా మారలేదు. అయితే ఈఎస్ ప్లస్ అపేడేట్ వెర్షన్ స్పోర్టియర్ గ్రాఫిక్స్(Sportier Graphics)తో పాటు కొత్త రంగు ఎంపికలతో ఆకట్టుకుంటుంది. గ్రే రెడ్, బ్లాక్ నియాన్ రంగులతో లాంచ్ చేసింది. 2025 స్పోర్ట్ ఈఎస్ ప్లస్ బైక్‌కు పవర్ ఇవ్కివడానికి సుపరిచితమైన 109.7 సీసీ ఎయిర్-కూల్డ్ ఇంజిన్(Air-Cooled Engine)తో లాంచ్ చేశారు. అందువల్ల ఈ బైక్ 8 హెచ్‌పీ పవర్ అవుట్ పుట్‌తో పాటు 8.7 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ బైక్ ఫోర్ స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేసి వస్తుంది. ఈ బైక్‌పై గంటకు 90 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకుపోవచ్చు. టీవీఎస్ స్పోర్ట్ ఈఎస్ ప్లస్ బైక్ సస్పెన్షన్ విధులను నిర్వహించేందుకు ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్లను అందిస్తుంది స్పోర్ట్ శ్రేణిలో ఇప్పుడు మూడు వేరియంట్లు ఉన్నాయి. సెల్ఫ్ స్టార్ట్ ఈఎస్, సెల్ఫ్ స్టార్ట్ ఎస్ ప్లస్, సెల్ఫ్ స్టార్ట్ ఈఎల్ఎస్. ఈ బైక్స్ Bikes ధరలు రూ. 59,881 నుంచి రూ. 71,785 వరకు ఉన్నాయి. ఇక టీవీఎస్ మోటార్ కంపెనీ 2025 ఎడిషన్ టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్‌ను భారత మార్కెట్(Indian Market)లో విడుదల చేసింది. 2025 టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ వేరియంట్‌లో 7 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే వేరియంట్ ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ.1.18 లక్షలుగా ఉంది. అదే మోడల్‌లో 5 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లేతో కూడిన వేరియంట్ ధర రూ.1.09 లక్షలకు తగ్గించబడింది.