ePaper
More
    Homeబిజినెస్​TVS NTORQ 150 లాంచింగ్​.. ఫస్ట్​ హైపర్ స్పోర్ట్ స్కూటర్.. ప్రత్యేకతలు ఇవే..!

    TVS NTORQ 150 లాంచింగ్​.. ఫస్ట్​ హైపర్ స్పోర్ట్ స్కూటర్.. ప్రత్యేకతలు ఇవే..!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: భారత్​లో అత్యంత వేగవంతమైన, మొట్టమొదటి హైపర్ స్పోర్ట్ స్కూటర్ (hyper sport scooter) TVS NTORQ 150 ని టీవీఎస్ మోటర్ కంపెనీ విడుదల చేసింది.

    హైదరాబాద్ Hyderabad ​లోని తాజ్​ డెక్కన్​ Taj Deccan లో సోమవారం (సెప్టెంబరు 8) దేశీయ విపణిలోకి విడుదల చేసింది. ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్‌తో మెరుగైన భద్రత, నియంత్రణకు అనుగుణంగా ఈ కొత్త వాహనాన్ని తీర్చిదిద్దినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

    కొత్త తరం రైడర్‌లను ఆకర్షించే రీతిలో అధిక పనితీరు, స్పోర్టియర్ సౌందర్యం, అత్యాధునిక సాంకేతికతల సమ్మేళనంగా దీనిని తీర్చిదిద్దారు.

    149.7 cc రేస్-ట్యూన్డ్ ఇంజిన్‌తో నడిచే ఈ స్కూటర్, స్టీల్త్ ఎయిర్‌క్రాఫ్ట్ డిజైన్‌ ఆధారంగా రూపొందించారు. ఈ వాహన ప్రత్యేక ప్రారంభ ధర రూ. 1,19,000 (ఎక్స్-షోరూమ్, ఆల్ ఇండియా)గా కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు.

    TVS NTORQ స్పూర్తి 150లో MULTIPOINT® ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఏరోడైనమిక్ వింగ్‌లెట్‌లు, రంగుల అల్లాయ్ వీల్స్, సిగ్నేచర్ మఫ్లర్ నోట్ ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు.

    అలెక్సా, స్మార్ట్‌వాచ్ ఇంటిగ్రేషన్, లైవ్ ట్రాకింగ్, నావిగేషన్, OTA అప్‌డేట్‌లతో సహా 50+ స్మార్ట్ ఫీచర్​లు ఇందులో ఉన్నాయి.

    టీవీఎస్ మోటర్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ – హెడ్, కమ్యూటర్ & ఈవీ బిజినెస్, కార్పొరేట్ బ్రాండ్ & మీడియా హెడ్ అనిరుద్ధ హల్దార్ ఈ సందర్భంగా వాహన విశిష్టతలను వివరించారు.

    TVS NTORQ 150 | లాంచింగ్​.. ఫస్ట్​ హైపర్ స్పోర్ట్ స్కూటర్.. ప్రత్యేకతలు ఇవే..!
    TVS NTORQ 150 | లాంచింగ్​.. ఫస్ట్​ హైపర్ స్పోర్ట్ స్కూటర్.. ప్రత్యేకతలు ఇవే..!

    పనితీరు ఇలా..

    TVS NTORQ 150 149.7cc, ఎయిర్-కూల్డ్, O3CTech ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 7,000 rpm వద్ద 13.2 PS , 5,500 rpm వద్ద 14.2 Nm టార్క్‌ను అందిస్తుంది.

    కేవలం 6.3 సెకన్లలో 0–60 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది. ఇది 104 కిమీ/గం గరిష్ట వేగంతో ప్రయాణించగలదు. ఈ నేపథ్యంలోనే దీనిని అత్యంత వేగవంతమైన స్కూటర్‌గా కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు.

    స్పోర్టీ & ఫ్యూచరిస్టిక్ డిజైన్

    స్టెల్త్ ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి ప్రేరణ పొందిన TVS NTORQ 150లో MULTIPOINT® ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, స్పోర్టీ టెయిల్ ల్యాంప్‌లు, ఏరోడైనమిక్ వింగ్‌లెట్‌లు, సిగ్నేచర్ సౌండ్‌తో కూడిన స్టబ్బీ మఫ్లర్, నేకెడ్ హ్యాండిల్‌బార్, రంగుల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

    కలర్ ప్యాలెట్..

    ఈ వాహనాన్ని రెండు వేరియంట్లలో విడుదల చేశారు. అవేమిటంటే..

    • TVS NTORQ 150 – స్టెల్త్ సిల్వర్, రేసింగ్ రెడ్, టర్బో బ్లూలో లభిస్తుంది.
    • TFT క్లస్టర్‌తో TVS NTORQ 150 – నైట్రో గ్రీన్, రేసింగ్ రెడ్, టర్బో బ్లూలో ఉన్నాయి.

    More like this

    National Lok Adalat | 13న జాతీయ లోక్ అదాలత్

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: National Lok Adalat | జాతీయ లోక్ అదాలత్​ను కక్షిదారులు సద్వినియోగపర్చుకోవాలని నిజామాబాద్ పోలీస్...

    CM Revanth Reddy | ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్​కు తాగునీరు.. కేటీఆర్​కు సీఎం కౌంటర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​కు సీఎం రేవంత్​రెడ్డి...

    Baswa laxmi narsaiah | కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా బస్వా లక్ష్మీ నర్సయ్య

    అక్షరటుడే, ఇందూరు: Baswa laxmi narsaiah | భారతీయ జనతా పార్టీ (Bharatiya Janatha Party) ఆయా మోర్చాల...