ePaper
More
    HomeFeaturesTVS Ntorq 125 | అదిరిపోయే లుక్​లో టీవీఎస్​ కొత్త స్కూటర్​.. ప్రత్యేకతలు ఇవే..

    TVS Ntorq 125 | అదిరిపోయే లుక్​లో టీవీఎస్​ కొత్త స్కూటర్​.. ప్రత్యేకతలు ఇవే..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : TVS Ntorq 125 | ద్విచక్ర వాహనాల మార్కెట్​లో ఇప్పటికే టీవీఎస్ (TVS)​ కంపెనీ దూసుకు పోతుంది. ప్రజల అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా కొత్త కొత్త మోడళ్ల (New Models)ను మార్కెట్​లోకి విడుదల చేస్తోంది. తాజాగా మార్వెల్ అవెంజర్స్ స్ఫూర్తితో టీవీఎస్ ఎన్‌టార్క్ 125  సూపర్ సోల్జర్ ఎడిషన్‌ను కంపెనీ ఆవిష్కరించింది.

    ద్విచక్ర, త్రిచక్ర వాహనాల తయారీలో టీవీఎస్​ మోటార్ కంపెనీ ఇప్పటికే టాప్​లో ఉంది. తాజాగా మార్వెల్ సినిమా ఐకానిక్ సూపర్ హీరో కెప్టెన్ అమెరికా నుంచి ప్రేరణ పొంది టీవీఎస్ ఎన్‌టార్క్ 125 సూపర్ సోల్జర్ ఎడిషన్‌ను ప్రారంభించినట్లు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుత యువతను ఆకర్షించడానికి కొత్త మోడల్​ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. సూపర్​ హీరోల లుక్​లో ఈ బైక్​ యువతను ఆకట్టుకుంటుందని కంపెనీ భావిస్తోంది.

    READ ALSO  Vivo T4R | వీవో నుంచి స్లిమ్మెస్ట్‌ ఫోన్‌.. సేల్స్‌ ప్రారంభమయ్యేది అప్పుడే..

    TVS Ntorq 125 | ప్రత్యేకతలు తెలుసుకుందామా..

    TVS NTORQ 125 దేశంలో మొట్టమొదటి బ్లూటూత్-కనెక్ట్ చేయబడిన SMART స్కూటర్. స్పోర్ట్స్​ స్టైల్​లో దీనిని తయారు చేశారు. దీని ధర రూ.98,117(ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). ఈ స్కూటర్​ పెట్రోల్​ ట్యాంక్​ కెపాసిటీ 5.8 లీటర్లు. లీటర్​కు 48.5 కిలో మీటర్ల మైలేజ్​ ఇస్తుంది. అత్యధికంగా 95 కిలోమీటర్ల వేగంతో వెళ్లవచ్చు. పూర్తిగా డిజిటల్​ డిస్​ప్లే దీని ప్రత్యేకత. డిస్క్​ బ్రేక్​ సౌకర్యం ఉంది. ఈ నెల నుంచి అన్ని టీవీఎస్​ డీలర్‌షిప్‌లలో ఈ బండి అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది.

    Latest articles

    Collector Nizamabad | అభివృద్ధి పనులను తొందరగా పూర్తి చేయాలి

    అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్...

    Cp Sai chaitanya | రిమార్క్​ లేకుండా పదవీ విరమణ చేయడం అభినందనీయం : సీపీ

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Cp Sai chaitanya | ఎలాంటి రిమార్క్​ లేకుండా పదవీ విరమణ చేయడం ఎంతో...

    IND vs ENG Test | వ‌రుస‌గా టాస్ ఓడిన భార‌త్.. లంచ్ స‌మ‌యానికి రెండు వికెట్లు కోల్పోయి భార‌త్ ఎంత స్కోరు చేసిందంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IND vs ENG Test | ఓవ‌ల్ మైదానం వేదిక‌గా ప్రారంభ‌మైన‌ ఇంగ్లండ్- భార‌త్...

    Ex Mla Jeevan Reddy | అమలు కాని హామీలను ప్రజలు ప్రశ్నించాలి

    అక్షరటుడే, ఆర్మూర్: Ex Mla Jeevan Reddy | కాంగ్రెస్​ చేపడుతున్న పాదయాత్రలో అమలు కాని హామీలను ప్రజలు...

    More like this