అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | దసరా అయిపోవడంతో కుటుంబ సభ్యులు సరదాగా ఇంట్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. పిల్లలు ఆడుకుంటున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా టీవీలు, ఏసీలు పేలిపోయాయి. మూడు ఇళ్లలో సడెన్గా పేలుడు చోటు చేసుకోవడంతో ఆయా ఇళ్లలోని వారు ఆందోళనకు గురయ్యారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
హైదరాబాద్(Hyderabad) నగరంలోని సుచిత్రలో గల వసంత్ విహార్ కాలనీ(Vasant Vihar Colony)లోని పలు ఇళ్లలో శుక్రవారం ఎలక్ట్రానిక్ వస్తువులు పేలిపోయాయి. ఒకదాని తర్వాత ఒకటి చొప్పున వస్తువులు పేలడంతో ఏం జరుగుతుందో తెలియక ఆయా ఇళ్లలోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మొత్తం మూడు ఇళ్లలో ఏసీలు, టీవీలు పేలాయి. హై వోల్టోజీ(High Voltage) కారణంగా పేలుడు చోటు చేసుకుందని భావించారు. వెంటనే తేరుకొని ఇతర ఎలక్ట్రానిక్ వస్తువలకు కరెంట్ సరఫరా నిలిపి వేశారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారులకు(Electricity Department Officers) సమచారం ఇచ్చినా పట్టించుకోలేదని బాధితులు ఆరోపించారు. కాగా హై వోల్టేజీతో టీవీలు, ఏసీలు పేలిపోలేదని తేలింది. స్తంభాలకు ఉన్న విద్యుత్ తీగలు ఎర్త్ అవ్వడంతో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిసింది.