అక్షరటుడే, వెబ్‌డెస్క్ : TVK Chief Vijay | తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, ప్రముఖ తమిళ నటుడు విజయ్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది. కరూర్ తొక్కిసలాట (Karur Stampede) దుర్ఘటన దర్యాప్తు నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని పేర్కొంది. జనవరి 12న ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయానికి రావాలని నోటీసుల్లో తెలిపింది.
TVK Chief Vijay | కరూర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో..
టీవీకే గత సెప్టెంబర్ 27న కరూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో విజయ్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో జరిగిన భారీ తొక్కిడిలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, 110 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ దారుణ ఘటనపై సుప్రీం కోర్టు (Supreme Court) స్పందించింది. ఘటనకు సంబంధించిన కారణాలను లోతుగా పరిశీలించి బాధ్యులను గుర్తించేందుకు సీబీఐ (CBI)కి దర్యాప్తు అప్పగించింది.
TVK Chief Vijay | ముగ్గురు సభ్యుల పర్యవేక్షణ కమిటీ
ఘటనపై తమిళనాడు ప్రభుత్వం (Tamilnadu Government) సిట్ ఏర్పాటు చేయగా.. టీవీకే సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తమిళనాడు పోలీసులపై తమకు నమ్మకం లేదని పేర్కొనడంతో సుప్రీం కేసును సీబీఐకి అప్పగించింది. అంతేకాకుండా దర్యాప్తు నిష్పాక్షికంగా, స్వతంత్రంగా సాగేలా మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగీ అధ్యక్షతన ముగ్గురు సభ్యుల పర్యవేక్షణ కమిటీని సుప్రీం ఏర్పాటు చేసింది. కాగా.. ప్రస్తుతం దర్యాప్తు ఈ కమిటీ పర్యవేక్షణలోనే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో విజయ్‌కు సమన్లు జారీ కావడం కీలక పరిణామంగా చెప్పవచ్చు.