ePaper
More
    Homeఅంతర్జాతీయంTuvalu Island | వ‌ణికిస్తున్న గ్లోబ‌ల్ వార్మింగ్.. స‌ముద్రంలో మునిగిపోనున్న ఆ దేశం

    Tuvalu Island | వ‌ణికిస్తున్న గ్లోబ‌ల్ వార్మింగ్.. స‌ముద్రంలో మునిగిపోనున్న ఆ దేశం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Tuvalu Island | పర్యావరణ కాలుష్యం పెరుగుతోందంటే అది కేవలం వాతావరణ మార్పులకే పరిమితమవడం లేదు. గ్లోబల్ వార్మింగ్ (Global Warming) ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పరిణామాలు కన్పిస్తున్నాయి.

    అతివృష్టి, వరదలు, ఉష్ణోగ్రతల పెరుగుదల వంటి అంశాలు మానవాళిని భయాందోళనకు గురిచేస్తున్నాయి. అటు సముద్రమట్టాలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ దుష్పరిణామాల వల్ల భవిష్యత్తులో కొన్ని దేశాలు భూమిపై కనిపించకుండానే మాయమయ్యే ప్రమాదం ఉంది. అలాంటి దేశాల్లో అగ్రస్థానంలో నిలుస్తోంది తువాలు అనే చిన్న ద్వీప దేశం.

    Tuvalu Island | పెద్ద స‌మ‌స్యే..

    పసిఫిక్ మహాసముద్రంలో (Pacific Ocean), ఆస్ట్రేలియా మరియు హవాయి మధ్యనున్న తొమ్మిది చిన్న దీవుల సమాహారం తువాలు దేశంగా పేరుగాంచింది. కానీ ఇప్పుడు అదే దేశం గ్లోబల్ వార్మింగ్‌కి బలి కావడం ప్రారంభమైంది. 12,000 జనాభా కలిగిన ఈ దేశం ఇప్పటికే దాని భూభాగంలో 40 శాతాన్ని సముద్రంలో కోల్పోయింది. అదే కొనసాగితే ఈ దశాబ్దాంతానికి పూర్తిగా సముద్రంలో మునిగిపోవడం ఖాయం అంటున్నారు వాతావరణ నిపుణులు. తువాలు(Tuvalu) ప్రధాన ఆదాయ వనరు సముద్ర జలాలను లీజుకు ఇవ్వడం. మౌలిక వసతులన్నీ ఇతర దేశాల సహాయంతోనే అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా (Australia) ఈ దేశానికి ఎన్నో అవసరాలను నెరవేరుస్తోంది. సముద్ర మట్టానికి కేవలం ఐదు మీటర్ల ఎత్తులో ఉండే ఈ దేశం, పర్యాటక ఆదాయంపై కూడా ఆధారపడుతూ జీవనం సాగిస్తున్నారు. ఇక్క‌డి అందాల దీవులు సముద్ర మట్టాల పెరుగుదలతో ముంపునకు గురవుతున్నాయి.

    తువాలు భూభాగంగా మిగలకపోయినా, కనీసం ఆ దేశ సంస్కృతి, సంప్రదాయాలను రక్షించాలనే ఉద్దేశంతో తువాలు పాలకులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. తువాలును రక్షించేందుకు యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (United Nations Development Program) సహకారంతో కృత్రిమంగా భూభాగాన్ని పెంచే ప్రణాళికలు చేపడుతున్నారు. అయినా ఈ చర్యలు తాత్కాలికమేనని భావిస్తున్న ప్రజలు, తమ దేశ భవితవ్యం గురించి ఆందోళన చెందుతున్నారు. అయితే ఆస్ట్రేలియాతో కుదిరిన “క్లైమేట్ ఒప్పందం” ఆధారంగా, అక్క‌డి వారికి ప్రత్యేకంగా క్లైమేట్ వీసాలు (Climate visas) మంజూరు అవుతున్నాయి. ఈ క్ర‌మంలో ఇప్పటివరకు దాదాపు 10,643 మంది వీసాలకు అప్లై చేసుకోగా, మొదటి విడతలో లాటరీ విధానంతో 280 మందిని మాత్రమే ఎంపికచేయనున్నట్టు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్ర‌క‌టించింది. వీసా త్వ‌ర‌గా రాక‌పోతే ఈ నీరు ఎప్పుడెప్పుడు ముంచేస్తుందా అనే భయంతో తువాలు ప్రజలు ఉన్నారు.

    More like this

    High Court | హైకోర్టు సంచ‌ల‌న తీర్పు.. గ్రూప్‌1 ప‌రీక్ష‌లు మ‌ళ్లీ నిర్వ‌హించాల‌ని ఆదేశం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court | గ్రూప్‌1 ప‌రీక్ష‌లపై తెలంగాణ హైకోర్టు మంగ‌ళ‌వారం సంచ‌ల‌న తీర్పు వెలువరించింది....

    Nepal Government | వెన‌క్కి త‌గ్గిన నేపాల్ ప్ర‌భుత్వం.. సోష‌ల్ మీడియాపై నిషేధం ఎత్తివేత‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal Government | నేపాల్ ప్ర‌భుత్వం వెన‌క్కు త‌గ్గింది. సోష‌ల్ మీడియా సైట్‌లపై విధించిన...

    Sriram Sagar | శ్రీరామ్​సాగర్​కు కొనసాగుతున్న వరద.. 8 గేట్ల ఎత్తివేత

    అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్​సాగర్​ (SRSP)కు ఎగువ నుంచి...